Breaking News

మన ఫిల్టర్ కాఫీకి ప్రపంచం ఫిదా

Published on Wed, 10/16/2024 - 04:23

ఫిల్టర్‌ కాఫీ ఆ పేరు వింటేనే.. ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలేస్తుంది. ఉదయం నిద్ర లేవగానే వేడివేడిగా.. ఘుమఘుమలాడే ఫిల్టర్‌ కాఫీ తాగితే.. కలిగే ఫీలింగ్‌ మాటల్లో చెప్పలేం. ఉదయించే సూర్యుడితో పాటే.. ఒక కప్పు ఫిల్టర్‌ కాఫీ గొంతులో పడితే మనకు మరో కొత్త ప్రపంచం కనిపిస్తుంది. ఎక్కడలేని హుషారు కలిగిస్తుంది. 

కాఫీలో ఎన్నో రకాలున్నప్పటికీ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్‌ కాఫీనే. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో ఎంతో పేరొందిన ఈ ఫిల్టర్‌ కాఫీ ప్రపంచంలోనే ‘ది బెస్ట్‌’గా నిలిచింది. ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌ గైడ్‌ ప్లాట్‌ఫాం ‘టేస్ట్‌ అట్లాస్‌’ విడుదల చేసిన ప్రపంచ టాప్‌ కాఫీల జాబితాలో మన ‘ఫిల్టర్‌ కాఫీ’ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.      – సాక్షి, ఏపీ సెంట్రల్‌ డెస్‌్క 

భారత్‌లోకి ఎలా వచ్చిందంటే..? 
దీని మూలం ఆఫ్రికా. అక్కడి నుంచి ‘యెమెన్‌కు’ తీసుకువచ్చి పెంచడం మొదలుపెట్టారు. విత్తనాలు అమ్మడం, వేరే దేశాలకు ఇవ్వడం అక్కడ నిషిద్ధం. మక్కా వెళ్లిన సూఫీ సెయింట్‌ బాబా అక్కడి నుంచి రహస్యంగా ఏడు కాఫీ గింజలను తీసుకొచ్చి కర్ణాటకలోని చిక్‌మగలూర్‌ కొండల్లో నాటినట్లు చరిత్ర చెబుతోంది. 

అలాగే ‘టీ’కి ప్రత్యామ్నాయంగా బ్రిటీష్‌ వాళ్లు కాఫీ అమ్మకాలను, పంటను ప్రోత్సహించారని.. దీంతో కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు విస్తరించిందని పేర్కొంటున్నారు.  

టాప్‌–10 జాబితాలో ఉన్న వివిధ దేశాల కాఫీలు
1.   క్యూబన్‌ ఎ్రస్పెస్సో (క్యూబా) 
2.   ఫిల్టర్‌ కాఫీ (భారత్‌) 
3.   ఎ్రస్పెస్సో ఫ్రెడ్డో (గ్రీస్‌) 
4.   ఫ్రెడ్డో క్యాపుచినో (గ్రీస్‌) 
5.   క్యాపుచినో (ఇటలీ) 
6.   ఫ్రాప్పే కాఫీ (గ్రీస్‌) 
7.   రిస్ట్రోట్టో (ఇటలీ) 
8.   వియత్నమీస్‌ ఐస్డ్‌ కాఫీ (వియత్నాం) 
9.  ఎస్ప్రెస్సో (ఇటలీ) 
10.   టర్కిష్‌ కాఫీ ( టర్కీ)  

ప్రయోజనాలు 
ఫిల్టర్‌ కాఫీని మితంగా తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నివేదిక వెల్లడించింది. అలాగే మూడ్‌ బూస్టర్‌గా మారి.. ఏకాగ్రత, చురుకుదనం, మానసిక స్పష్టతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. 

టైప్‌–2 డయాబెటిస్‌ రిస్‌్కను తగ్గిస్తుందని, కాలేయానికి రక్షణ కల్పిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. కెఫిన్‌ వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

అధికమైతే అనర్థమే!
ఏదైనా అతిగా చేస్తే అనర్థమే. కొందరు రోజుకు ఆరేడుసార్లు ఫిల్టర్‌ కాఫీ తాగేస్తుంటారు. ఇలా ఫిల్టర్‌ కాఫీ కూడా అతిగా తాగితే పలు సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. 

ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులోని కెఫిన్‌ రక్తపోటును, హార్ట్‌రేట్, యాంగ్జైటీని పెంచుతుందని.. నిద్ర సమస్యలను కలుగజేస్తుందని హెచ్చరిస్తున్నారు. గర్భిణులు, చిన్నపిల్లలు దీనికి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. రోజుకు మూడు కప్పులకు మించి తాగొద్దని సూచిస్తున్నారు.   

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)