Breaking News

రెండు కొత్త జాతుల ఆర్మీ చీమల గుర్తింపు

Published on Tue, 02/24/2026 - 05:45

తూర్పు కనుమల్లో రెండు జాతులకు చెందిన ఆర్మీ చీమలను కనుగొన్నారు. కీటక శాస్త్రవేత్తలు సహనశ్రీ, ప్రియదర్శనన్, ఒడిశాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్స్‌(నైసర్‌) పరిశోధకులు బికాశ్‌ సాహు, నిఖితా కుమారన్, అనిరుద్ధ దత్తారాయ్‌ తమ పరిశోధనలో ఈ చీమలను గుర్తించారు. ఏపీలోని శ్రీ వేంకటేశ్వర వన్యప్రాణుల అభయారణ్యంలో అనిక్టస్‌ చిట్టోరెన్సిస్, శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో అనిక్టస్‌ లంకమల్లెన్సిస్‌ రకానికి చెందిన చీమలను గుర్తించారు. ఈ ఆర్మీ చీమలు సంచార జాతులు.

ఇవి నిర్వహించే సామూహిక మేత దాడులు ఇతర కీటకాలు, పక్షులు, బల్లులకు ఆహారాన్ని అందించేందుకు తోడ్పడతాయి. ఇవి పర్యావరణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఇవి ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థల్లో కనిపించే అత్యంత సంచార మాంసాహారులు. వాటి శరీరాలతో తాత్కాలిక బయోవాక్స్‌ను ఏర్పాటు చేసుకుంటాయి. సామాజిక కీటకాలుగా అవి భారీ కాలనీలను ఏర్పాటు చేసుకుంటాయి.

ఇవి దండెత్తి కీటకాలు, ఇతర చిన్న కీటకాలను తింటాయి. పెద్ద, పదునైన కోరలతో కుట్టగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటివరకు పరిశోధన, అధ్యయనాల ఆధారంగా దేశంలో 38 రకాల ఆర్మీ చీమలను గుర్తించారు. ఇప్పుడు ఈ రెండు కొత్త జాతులను కనుగొనడంతో ఆర్మీ చీమల జాతుల సంఖ్య 40కి చేరుకుందని కీటక శాస్త్రవేత్తలు సహనశ్రీ, జీవ వైవిద్య పరిశోధకులు మంజునాథ్‌ ఎస్‌ నాయక్‌ తెలిపారు. 
 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)