Breaking News

కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Published on Fri, 08/25/2023 - 19:03

న్యూఢిల్లీ: ప్రధాని డిగ్రీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాకిచ్చింది సుప్రీంకోర్టు. ప్రధాని డిగ్రీకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ హైకోర్టు పరువు నష్టం చర్యలు తీసుకోకుండా స్టే విధించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. 

ప్రధాని డిగ్రీకి సంబంధించి తమ యూనివర్సిటీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు మరో ఆప్ నేత సంజయ్ సింగ్‌లపై గుజరాత్ యూనివర్సిటీ రిజిష్ట్రార్ పీయూష్ పటేల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మధ్యంతర స్టే విధించాల్సిందిగా మొదట గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించగా ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

కేసు గుజరాత్ హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున దీనిపై తాము ఎటువంటి నోటీసులు ఇవ్వలేమని చెబుతూ సంజీవ్ ఖన్నా, ఎస్‌విఎన్ భట్టిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అరవింద్ కేజ్రీవాల్, గుజరాత్ యూనివర్సిటీ హైకోర్టుకు వివరణ ఇవ్వాలని తెలిపింది.   

అంతకు ముందు ప్రధాని డిగ్రీపై వ్యంగ్యంగానూ అవమానకరంగానూ వ్యాఖానించినందుకు వీరిరువురికీ గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టును ఆశ్రయించగా కేజ్రీవాల్‌కు అక్కడ కూడా చుక్కెదురైంది. పరువు నష్టం కేసు ట్రయల్‌పై మధ్యంతర స్టే విధించాలన్న వారి రివిజన్ అప్లికేషన్‌ను సెషన్స్ కోర్టు కూడా తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టులో ఆగస్టు 29న ఈ కేసు విచారణకు రానుంది.  

ఇది కూడా చదవండి: G20 Summit: ఢిల్లీలో మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)