Breaking News

ఎంపీ సంజయ్‌ సింగ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా.. కోర్టు నోటీసులు

Published on Tue, 12/17/2024 - 21:28

ఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌కు భారీ షాక్‌ తగిలింది. క్యాష్‌ ఫర్‌ జాబ్‌ స్కామ్‌ కేసులో తన ప్రమేయం ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై సంజయ్‌ సింగ్‌పై గోవా సీఎం ప్రమాద్‌ సావంత్‌ సతీమణి రూ.100కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు సంబంధించి గోవా కోర్టు సంజయ్‌ సింగ్‌కు నోటీసులు పంపించింది. పరువు నష్టం దావా కేసుపై జనవరి 10లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.  

ప్రమోద్‌ సావంత్‌ భార్య సులక్షణ సావంత్‌ ఉత్తర గోవాలోని బిచోలిమ్‌లోని సివిల్‌ జడ్జి సీనియర్‌ డివిజన్‌ ​​కోర్టులో కేసు వేసినట్లు బీజేపీ అధికార ప్రతినిధి గిరిరాజ్‌ పాయ్‌ వెర్నేకర్‌ తెలిపారు. తాత్కాలిక సివిల్ జడ్జి ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం నోటీసులు జారీ చేసినట్లు వెర్నేకర్‌ వెల్లడించారు.  

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఢిల్లీ మీడియా సమావేశంలో సులక్షణ సావంత్‌పై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై సులక్షణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. పరువుకు భంగం కలిగేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన సంజయ్‌ సింగ్‌ తనకు రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు తన గురించి సంజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. 
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)