ఆ గంభీరమైన గొంతు మూగబోయింది..ప్రముఖ న్యూస్‌ రీడర్‌ కన్నుమూత

Published on Thu, 02/12/2026 - 16:47

దూరదర్శన్ ప్రముఖ మాజీ న్యూస్‌ రీడర్‌ సరళ మహేశ్వరి ఈ రోజు మృతి చెందారు. గంభీరమైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణతో మూడు దశాబ్దాల పాటు వార్తా రంగంలో ప్రముఖ న్యూస్‌రీడర్‌గా నిలిచారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

1976లో దూరదర్శన్‌లో అనౌన్సర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి.. దాదాపు మూడు దశాబ్దాల పాటు మీడియా రంగంలో తన గంభీరమైన స్వరంతో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న సరళ మహేశ్వరి ఇక లేరు. న్యూస్ యాంకర్ అనే భావన సాధారణం కాకముందు హుందాగా స్పష్టమైన ఉచ్చారణతో వార్తలను చదువుతూ న్యూస్‌ రీడర్‌గా ప్రస్థానం ప్రారంభించాలనుకునే యువ యాంకర్లకు మార్గదర్శకంగా నిలిచారామె.  71 ఏళ్ల వయసులో ఢిల్లీలో కన్నుమూశారు. ఆమె అనారోగ్య కారణాల వల్ల మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. సరళ మహేశ్వరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ దూరదర్శన్‌ నేషనల్‌.. ‘X’ వేదికగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా వార్తా రంగంలో ఆమె సేవలను గుర్తు చేసుకుంది. 1984 వరకు దూరదర్శన్‌లోనే పనిచేశారామె.

“దూరదర్శన్ కుటుంబం తరపున.. సరళ మహేశ్వరికి మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం. దూరదర్శన్ న్యూస్ రీడర్‌గా.. ఆమె సున్నితమైన స్వరం, కచ్చితమైన ఉచ్చారణ, గౌరవప్రదమైన డెలివరీతో భారతీయ వార్తా ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె సింప్లిసిటీ, సంయమనం, వ్యక్తిత్వం.. ప్రేక్షకులలో లోతైన నమ్మకాన్ని కలిగించాయి” అని పోస్ట్‌ చేసింది. 

మహేశ్వరి మరణాన్ని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్.. “టెలివిజన్ జర్నలిజంలో స్వర్ణయుగం ముగింపు”గా అభివర్ణించింది. ఆమె విశ్వసనీయత, మర్యాద ఎల్లప్పుడూ రాబోయే తరాలకు ప్రేరణగా ఉంటాయని పేర్కొంది. ప్రశాంతమైన అందమైన ముఖంతో ప్రేక్షకులను పలకరిస్తున్నట్లుగా అత్యంత నైపుణ్యంతో వార్తలు అందించేవారామె. ఆమె గొంతుకకు మాతమ్రేగాక ధరించే దుస్తులకు కూడా అభిమానులు ఉండేవారట. దూరదర్శన్‌కు ఆమె దుస్తుల గురించి వందలాది అబిమానుల లేఖలు వచ్చేవట. 

ఆమె ధరించే గుజరాతీ చీరలను హిందీ చిత్రపరిశ్రమలో నటీనటుమణులు కూడా కాపీ చేసేవారట. అంతేగాదు ఆమె చీర కట్టు తీరు కూడా అత్యంత విలక్షణంగా ఉంటుంది, పైగా ఆ క్రెడిట్‌ని తన తల్లికే ఇచ్చేవారట ఆమె. నిజానికి టెలిప్రాంప్టర్లు లేని యుగం, న్యూస్ రీడర్లు పూర్తిగా వారి జ్ఞాపకశక్తిపై ఆధారపడవలసి వచ్చింది. దాంతో సరళ తరుచుగా ఇంటర్వ్యూలలో ఇలా అనేవారట. ఇది అపారమైన బాధ్యతతో కూడిన పని అని, దీన్ని బాగా చేయడానికి ఎంతో కొంత పరిణతి ఉండాలని చెప్పేవారట.

(చదవండి: ఎవరీ పప్పుదేవి..? ఆమె అద్భుతమైన పులి కళ్లతో..)

 

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)