Breaking News

సనాతన ధర్మం.. భారత్‌కు మారుపేరు: మోహన్ భగవత్‌

Published on Fri, 10/13/2023 - 08:16

ఛండీగర్‌: సనాతన ధర్మం భారత్‌కు పర్యాయపదమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశ సంస్కృతి సనాతన ధర్మం మీదే ఆధారపడి ఉందని చెప్పారు. అలాంటి ధర్మాన్ని నాశనం చేయాలనుకోవడం స్వీయ హానితో సమానమని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంటలు రేపుతుండటం తెలిసిందే. వాటిని ఉద్దేశించి భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం హరియాణాలోని రోహతక్‌లో బాబా మస్త్‌నాథ్ మఠంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సనాతనమంటేనే ఎప్పటికీ నిలిచి ఉండేదని, మన ధర్మం కూడా అంతేనని చెప్పారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి వీకే సింగ్, యోగ గురు రామ్‌దేవ్, పలువురు సాధు ప్రముఖులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా పరిష్కారం కోసం అంతా భారత్‌కేసే చూస్తున్నారని ఆదిత్యనాథ్ అన్నారు. ఒకప్పుడు అసాధ్యమనుకున్న అయోధ్య రామాలయ నిర్మాణం ఇప్పుడు కళ్లముందు కన్పిస్తున్న వాస్తమని చెప్పారు. అంతకుముందు ఉదయం జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, మహంత్ చంద్‌నాథ్ యోగి విగ్రహాన్ని మఠంలో ఆవిష్కరించారు. 

ఇదీ చదవండి: గంగా జలంపై జీఎస్టీ.. ట్యాక్స్‌ బోర్డు ఏం చెప్పిందంటే..

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)