Breaking News

సామూహిక వివాహాల్లో 30 జంటలకు ‘మళ్లీ పెళ్లి’

Published on Mon, 06/17/2024 - 11:56

ప్రభుత్వం పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో చేపడుతున్న కొన్ని పథకాలు పెడదారి పడుతున్నాయి. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలనే ఆశతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో జరిగిన సామూహిక వివాహ యోజనలో పలు అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతో పాటు ఇంటి సామగ్రి పొందాలనే ఆశతో 30 జంటలు ఈ కార్యక్రమంలో మళ్లీ పెళ్లి చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే దుర్గ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిగాయి. 301 జంటలకు వివాహం జరిగింది.

ఈ కార్యక్రమానికి సీఎం విష్ణుదేవ్‌ సాయి కూడా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఇక్కడ వివాహాలు చేసుకున్న జంటలలో 30 జంటలు మళ్లీ పెళ్లిచేసుకున్నాయని మీడియాకు తెలియవచ్చింది.  అలాగే ఇక్కడ పెళ్లిళ్లు చేయిస్తామంటూ కొందరు ఏజెంట్ల తయారైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. వీరు కొందరు జంటల నుంచి సొమ్ము వసూలు  చేసినట్లు భోగట్టా. ఒక జంటకు ఇద్దరు పిల్లలను ఉన్నప్పటికీ వారు ఇక్కడ మళ్లీ పెళ్లి చేసుకున్నారని తెలియవచ్చింది.

దుర్గ్‌లోని అగ్రసేన్ భవన్‌లో ఏర్పాటు చేసిన సామూహిక వివాహ కార్యక్రమంలో సినిమా తరహా దృశ్యాలు అనేకం కనిపించాయి. ఒకరు పెళ్లి విషయంలో గొడవ పడుతూ, డబ్బు కోసం పెళ్లి చేసుకున్నట్లు కనిపించింది. అలాగే ఒక ఏజంట్‌ ఏడు జంటలను మళ్లీ పెళ్లి కోసం తీసుకువచ్చినట్లు నిర్వాహకుల విచారణలో తేలింది. కాగా ఈ ఏజెంట్‌ ఆ జంటల నుంచి రూ. రెండు వేలు చొప్పున వసూలు చేశాడని సమాచారం. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకునే జంటలకు రూ. లక్షతో పాటు ఇతరత్రా సామాను అందిస్తుంటుంది. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు