Breaking News

సాక్షి మార్నింగ్‌ రౌండప్‌: ఈరోజు బిగ్‌ హెడ్‌లైన్స్‌ ఇవే!

Published on Mon, 07/20/2026 - 06:41

సాక్షి పాఠకులకు శుభోదయం!. దేశ రాజకీయాల నుంచి ప్రపంచ పరిణామాల వరకు, క్రీడా ప్రపంచం నుంచి అంతర్జాతీయ ఉద్రిక్తతల వరకు.. ఈరోజు ఉదయం తెలుసుకోవాల్సిన ప్రధాన వార్తలు మీ కోసం.

ఈరోజు దేశం దృష్టి పార్లమెంట్‌ సమావేశాలపై నిలవనుండగా.. ఢిల్లీలో 'చలో సంసద్‌' పిలుపుతో భద్రత కట్టుదిట్టమైంది. ప్రపంచకప్‌(FIFA 2026) విజయంతో స్పెయిన్‌ సంబరాల్లో మునిగిపోగా.. మెస్సీ కన్నీటి వీడ్కోలుతో ఫుట్‌బాల్‌ ప్రపంచం భావోద్వేగంలో మునిగింది. మరోవైపు ఇరాన్‌-అమెరికా ఉద్రిక్తతలు ప్రపంచాన్ని కలవరపెడుతుండగా.. దేశీయ మార్కెట్లు, వాతావరణ పరిస్థితులు కూడా నేటి చర్చల్లో నిలవనున్నాయి.

నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు
కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పలు కీలక బిల్లులు, ప్రతిపక్ష వ్యూహాలు, ధరల పెరుగుదల, భద్రత, విదేశాంగ అంశాలపై అధికార-విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. తొలి రోజే సభ హాట్‌హాట్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

ఢిల్లీలో 'చలో సంసద్‌' ఉద్రిక్తత
కాక్రోచ్‌ జనతా పార్టీ ఇచ్చిన "చలో సంసద్‌" పిలుపుతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనలకు అవకాశం లేకుండా పలు ప్రాంతాల్లో సెక్షన్‌ 144 అమల్లోకి వచ్చింది. భారీగా పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా విధించారు. నీట్‌ లీకేజీ వ్యవహారంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు సీజేపీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

స్పెయిన్‌కు ఫిఫా ప్రపంచకప్‌.. కన్నీటితో మెస్సీ వీడ్కోలు
16 ఏళ్ల నిరీక్షణకు తెరదించి స్పెయిన్‌ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో అర్జెంటీనాపై 1-0తో విజయం సాధించి మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఎక్స్‌ట్రా టైంలో ఫెర్రాన్ టోర్రెస్ (Ferran Torres) గోల్‌ కొట్టడంతో ఆట మొత్తం మారిపోయింది. ఓటమితో అర్జెంటీనా అభిమానులు నిరాశలో మునిగిపోగా.. మెస్సీ తన అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్‌కు భావోద్వేగంగా వీడ్కోలు పలికాడు. మరోవైపు టోర్నీలో అత్యధిక గోల్స్‌తో ఎంబాపే గోల్డెన్‌ షూ అందుకున్నాడు.

ఇరాన్‌-అమెరికా యుద్ధం.. ఉద్రిక్తత కొనసాగుతోంది
మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌-అమెరికా మధ్య ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ దౌత్య పరిణామాలపై ఈ యుద్ధ ప్రభావం పడుతోంది.

మార్కెట్లపై ఫోకస్‌
పార్లమెంట్‌ సమావేశాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల కదలికల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు ఒడిదొడుకులతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాతావరణం
నైరుతి మళ్లీ పుంజుకుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈరోజు ఫోకస్‌లో...
పార్లమెంట్‌ తొలి రోజు పరిణామాలు
ఢిల్లీలో 'చలో సంసద్‌' ప్రభావం
ప్రపంచకప్‌ విజయోత్సవాల్లో స్పెయిన్‌
మెస్సీ రిటైర్మెంట్‌పై ప్రపంచ స్పందన
ఇరాన్‌-అమెరికా యుద్ధ తాజా పరిణామాలు
మార్కెట్ల కదలికలు, వాతావరణ అప్‌డేట్స్‌.. మరిన్ని బ్రేకింగ్‌ అప్‌డేట్స్‌, విశ్లేషణలు, ప్రత్యేక కథనాల కోసం రోజంతా సాక్షి.కామ్‌తోనే ఉండండి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)