Breaking News

పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌

Published on Sun, 08/18/2024 - 05:18

కాన్పూర్‌/న్యూఢిల్లీ: వారణాసి– అహ్మదాబాద్‌ మధ్య నడిచే సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ శనివారం యూపీలో పట్టాలు తప్పింది. పట్టాలపైనున్న ఒక వస్తువు రైలింజిన్‌ను బలంగా తాకడంతో 20 బోగీలు పట్టాలు తప్పాయి. కాన్పూర్‌–భీమ్‌సేన్‌ రైల్వే స్టేషన్ల మధ్య తెల్లవారు జామున 2.35 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

పెద్ద శబ్దంతో బోగీలు ఊగుతూ, రైలు నిలిచిపోవడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడి లేచారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఘటన అనంతరం ప్రయాణికులందరినీ బస్సుల్లో కాన్పూర్‌ రైల్వే స్టేషన్‌కు, అక్కడికి నుంచి వేరే రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు.    

కుట్ర కోణంలో దర్యాప్తు
‘రైలు పట్టాలపైనున్న ఓ వస్తువు ఇంజిన్‌ను తాకినట్లు ఆనవాళ్లున్నాయి. అన్ని ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. యూపీ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు’అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘బండరాయి వంటిదేదో గట్టిగా గుద్దుకోవడంతో ఇంజిన్‌ ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని, వంగిపోయినట్లు లోకో పైలట్‌ చెబుతున్నారు. 16వ బోగీ సమీపంలో మాకు దొరికిన వస్తువే ఇంజిన్‌ దెబ్బతినేందుకు కారణమై ఉండొచ్చు. ఇది సంఘ వ్యతిరేక శక్తుల పని’గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)