Breaking News

సేనల ఉపసంహరణ స్వాగతించదగింది

Published on Mon, 11/04/2024 - 06:27

బ్రిస్బేన్‌: భారత్, చైనాలు సరిహద్దుల్లో అత్యంత సమీపంలో మోహరించిన బలగాల ఉప సంహరణపై కొంత పురోగతి సాధించడం స్వాగతించదగిందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు. అనంతర చర్యలకు ఈ పరిణామం దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాలైన డెమ్‌చోక్, డెప్సాంగ్‌ల నుంచి రెండు దేశాలు ఇటీవల బలగాలను ఉపసంహరణను పూర్తి చేసుకోవడం, అనంతరం భారత్‌ ఆర్మీ పరిశీలనాత్మక గస్తీ జరుపుతున్న క్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

మంత్రి జైశంకర్‌ ఆదివారం జరిగిన కార్యక్రమంలో భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘వాస్తవా«దీన రేఖ వెంబడి 2020కు ముందు లేని ప్రాంతాల్లో చైనా బలగాలు ముందుకు చొచ్చుకువచ్చాయి. దీంతో మేం కూడా బలగాలను మోహరించాం. కొన్ని ఇతర కారణాలు కూడా ఇందుకు తోడయ్యాయి. దాదాపు నాలుగేళ్లపాటు బలగాలు అత్యంత సమీపంలో మోహరించి ఉన్నాయి. 

ఏదైనా అనూహ్య సంఘటన జరిగే అవకాశమున్న పరిస్థితి అది. తాజాగా భారత్, చైనాలు కొంత పురోగతి సాధించాయి. సేనలను వెనక్కి తీసుకున్నాయి. ఇది స్వాగతించదగిన పరిణామం. ఇది ఇతర సానుకూల చర్యలకు దారి తీసే అవకాశముంది’అని ఆయన అన్నారు. ఉక్రెయిన్, పశి్చమాసియాల్లో కొనసాగుతున్న సంక్షోభాలు ప్రపంచంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయంటూ ఆయన..ఈ సమస్యల పరిష్కారానికి భారత్‌ తన వంతు కృషి కొనసాగిస్తోందని వెల్లడించారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)