Breaking News

కర్ణాటక డీజీపీ ఆఫీసులో రాసలీలలు.. వీడియో వైరల్‌

Published on Mon, 01/19/2026 - 15:13

బెంగళూరు: కర్ణాటకలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో పోలీసు అధికారి రాసలీలలకు సంబంధించిన వీడియా ఒకటి కలకలం రేపుతోంది. రాష్ట్రానికి చెందిన  ఓ సీనియర్ పోలీసు అధికారి డీజీపీ ఆఫీసులో పనిచేస్తున్నా ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో, ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

వివరాల మేరకు.. డీజీపీ ఆఫీసులో సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా డా. రామచంద్రరావు పనిచేస్తున్నారు. అయితే, రామచంద్రరావు.. ఆఫీసులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. సదరు మహిళ ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో అసభ్యకరంగా తాకడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేశారు. అయితే, ఇదంతా డీజీపీ ఆఫీసులో పనిచేస్తున్న కొందరు రికార్డు చేసినట్టు తెలిసింది. 

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక, ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లడంతో.. రాసలీలల వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి చేరింది. అయితే ఈ అంశంపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య  సీరియస్ అయ్యారు.  ఈ వీడియోలపై అధికారి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పోలీస్ బాస్‌ కార్యాలయంలోనే ఈ వ్యవహారం జరగడంతో అక్కడి పోలీసు శాఖలో క్రమశిక్షణపై సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ఆఫీసు ఘటన పొలిటికల్‌ టర్న్‌ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. 

Karnataka : ఆఫీస్ లోనే ముద్దులు, కౌగిలింతలు అడ్డంగా దొరికిన DGP..

మరోవైపు.. ఈ ఘటనపై పోలీసు అధికారి  రామచంద్రరావు స్పందించారు. ఆ  వీడియోలో ఉన్నది తాను కాదని ఈ వీడియోని తనకు గిట్టని వ్యక్తులు మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టారని ఆరోపించారు. కాగా  ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రరావు గతంలో  గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యారావు తండ్రి కావడం గమనార్హం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)