Breaking News

‘మాతృభాష తప్పనిసరి’.. ఆ రాష్ట్రాలకు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు?

Published on Tue, 07/08/2025 - 11:30

న్యూఢిల్లీ: ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ, పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)2020 కింద కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ తరహా భాషా వివాదం తలెత్తింది. అయితే ఈ త్రిభాషా విధానాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కూడా వ్యతిరేకిస్తోంది. బీజేపీ విధానాలకు మద్దతు పలికే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ స్థానిక భాషలలో ప్రాథమిక విద్యను కొనసాగించాలన్న వాదనను సమర్థిస్తూ, ఈ అంశంలో తన వైఖరిని వెల్లడించింది. రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో  ఆర్‌ఎస్‌ఎస్‌అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ అన్ని భారతీయ భాషలు జాతీయ భాషలే అంటూ, ఇదే సంఘ్‌ వైఖరని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతంలో సొంత భాషలోనే మాట్లాడుతుంటారు. అందుకే ప్రాథమిక విద్యను అదే భాషలో  కొనసాగించాలని ఆయన అన్నారు.
 

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 కింద త్రిభాషా విధానం కింద విద్యార్థులు తమ పాఠశాల విద్యలో మూడు భాషలు నేర్చుకోవాలి. జాతీయ ఐక్యతను సమతుల్యం చేస్తూ బహుభాషావాదాన్ని పెంపొందించడమే దీని లక్ష్యం.  అయితే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఈ త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించాయి. ప్రాథమిక విద్యలో స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ అవి పట్టుబట్టాయి. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఇదే ధోరణి ప్రదర్శించింది. అయితే  ఈ తరహా భాషా సమస్యను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని, రాత్రికి రాత్రే జరగదని సునీల్ అంబేకర్ పేర్కొన్నారు.

Videos

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

Photos

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)