Breaking News

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు సెక్యూరిటీ పెంపు

Published on Wed, 08/28/2024 - 12:00

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పెంచింది. దీంతో ఆయనకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కల్పిస్తున్న తరహాలో భద్రత లభించనుంది.

హోం మంత్రిత్వ శాఖ మోహన్ భగవత్ భద్రతను జెడ్‌ ప్లస్‌ నుంచి నుండి ఎఎస్‌ఎల్‌(అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్)స్థాయికి పెంచింది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు ఇంతవరకూ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండేది. మోహన్ భగవత్‌కు క్పల్పించిన భద్రత సరిపోదని గుర్తించిన ప్రభుత్వం అతని కోసం క్తొత భద్రతా ప్రోటోకాల్‌ రూపొందించింది. పలు భారత వ్యతిరేక సంస్థలు ఆయనను టార్గెట్ చేస్తున్నాయనే నిఘావర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది.

నూతన భద్రతా  ఏర్పాట్ల ప్రకారం మోహన్ భగవత్ సందర్శించే ప్రదేశంలో సీఐఎస్‌ఎఫ్‌ బృందాలు ఉంటాయి. ఆయనకు 2015,  జూన్ లో జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో సిబ్బంది, వాహనాల కొరత కారణంగా  జెడ్ ప్లస్ భద్రత కల్పించలేదు. ఈ తరహా భద్రతలో 55 మంది కమాండోలు  మోహన్‌ భగవత్‌ కోసం 24 గంటలపాటు విధులు నిర్వహిస్తుంటారు.

ఏఎస్‌ఎల్‌ కేటగిరీ భద్రతలో సంబంధిత జిల్లా పరిపాలన, పోలీసు, ఆరోగ్యం, ఇతర విభాగాలు వంటి స్థానిక ఏజెన్సీలు పాలుపంచుకుంటాయి. మోహన్ భగవత్  ఏదైనా కార్యక్రమానికి వెళ్లే సందర్భంలో  ఆ స్థలాన్ని పరిశీలించడానికి అధికారుల బృందం వెళ్తుంది. వారు క్లాలిటీ ఇచ్చిన తరువాతనే మోహన్ భగవత్ ఆ కార్యక్రమానికి వెళతారు.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)