హిందువులు ఉనికి కోల్పోతే.. ప్రపంచమే ఉండదు: మోహన్‌ భగవత్‌

Published on Sat, 11/22/2025 - 12:29

ఇంఫాల్‌: హిందువులు ఉన్నంత వరకు ప్రపంచం ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS) అధినేత మోహన్‌ భగవత్‌. భారత నాగరికత ఇప్పటి వరకు నిలిచింది.. భవిష్యత్‌లోనూ ఉంటుంది. ఇప్పటికే పలు దేశ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పారు. కానీ మన భారతదేశ నాగరికత అమరమైందని వ్యాఖ్యానించారు. 

మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు చెలరేగిన తర్వాత ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తొలిసారిగా అక్కడ పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ..‘ప్రపంచంలోని ప్రతి దేశం అన్ని రకాల పరిస్థితులను చూసింది. భారతదేశ నాగరికత ఎప్పటికీ అలాగే ఉంటుంది. హిందువులు ఉనికి కోల్పోతే.. ప్రపంచానికే ఉనికి ఉండదు. ప్రతిఒక్కరూ మారుతున్న పరిస్థితుల గురించి ఆలోచించాలి. ఎందుకంటే భారత సమాజంలో మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల హిందూ సమాజం ఉండి తీరుతుంది. సమాజానికి ఏం కావాలో దాన్ని హిందూ సమాజం సాధిస్తుంది. అది ఈశ్వరుడి కర్తవ్యం అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో, యునాన్ (గ్రీస్), మిస్ర్ (ఈజిప్ట్), రోమా దేశ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పారు.

మరోవైపు.. అమెరికా సుంకాల విధింపు విషయమై ఆయన స్పందిస్తూ..‘దేశ నిర్మాణానికి బలం చాలా అవసరమన్నారు. బలం అంటే ఆర్థిక సామర్థ్యం అని చెప్పుకొచ్చారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఎవరిపైనా ఆధారపడకూడదని సూచించారు. ఇది కష్టతరమైనది ఏం కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. చివరగా.. నక్సలిజాన్ని సమాజం అంగీకరించబోదని.. అది ముగిసిన అధ్యయనం అని తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశం చేసిన స్వాతంత్ర్య పోరాటాన్ని ఉదాహరణగా ఉదహరించారు. భారతదేశంలో బ్రిటిష్ సూర్యుడు అస్తమించాడని చెప్పారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)