Breaking News

ఎవ్వరికీ వ్యతిరేకం కాదు.. అధికారం కోరుకోదు 

Published on Sun, 02/08/2026 - 06:24

ముంబై: సమాజాన్ని ఐక్యంగా ఉంచాలన్నదే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) లక్ష్యమని సంస్థ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చెప్పారు. అంతేతప్ప, ఆర్‌ఎస్‌ఎస్‌ ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదు, అధికారాన్ని కోరుకోదు, ప్రభావాన్ని చూ పాలనీ అనుకోదు అని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో ఉన్న అనైక్యత తదితర అనేక బలహీనతలను గమనించిన డాక్టర్‌ కేశవ్‌ బలిరామ్‌ హెగ్డేవార్‌ 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారన్నారు. 

సంస్థ అవతరించి వందేళ్లయిన సంద ర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. సమాజాన్ని ఐక్యంగా ఉంచడమనే కర్త వ్యాన్ని మినహా మరే పనినీ ఆర్‌ఎస్‌ఎస్‌ చేపట్టబోదన్నారు. ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత ఇక మరే ఇతర ఎజెండా ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉండదని భగవత్‌ చెప్పారు. ‘అన్ని మతాలను గౌరవించాలని నిర్ణయించుకోవడానికి కారణం మనం హిందువులం కావడమే. 

హిందూ ధర్మంలో ఉన్న సహనం వల్లే భారత్‌ ఇప్పటికీ భిన్నత్వంలో ఏక త్వాన్ని చాటుతోంది. హిందూ భావ విస్మరణ వల్లే దేశం ముక్కలైంది. అంటే, హిందువులు తమ సాంస్కృతిక, ధార్మిక మూలాలను లేదా ఐక్యతను మర్చిపోవడం వల్లే విభజన అడ్డుకోలేకపోయాం’అని ఆయన వివరించారు. దేశంలో ఇస్లాం, క్రైస్తవ మతాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలుజరుగుతున్నప్పటికీ, దేశం మాత్రం ఐక్యంగానే ఉందన్నారు. 

ఈ ఐక్యతకు కారణం మన దేశ ప్రాథమిక హిందూ స్వభావమేనని ఆయన నొక్కి చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వల్లే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారంటూ కొందరు భావిస్తున్నారన్న ఆయన.. మోదీ రాజకీయ పారీ్టకి నా యకత్వం వహిస్తుండగా ఆర్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారన్న విషయం గమనించాలని కోరారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజకీయాలతో ఎటువంటి సంబంధం ఉండదని స్ప ష్టం చేశారు. అదేవిధంగా, హిందూభావాన్ని మ ర్చిపోయిన ఫలితంగానే దేశ విభజన జరిగిందని భగవత్‌ అభిప్రాయపడ్డారు. చర్చలు జరపనిదే ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి అర్థం కాదని పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?