Breaking News

లారెన్స్ బిష్ణోయ్ సోద‌రుడు అన్మోల్‌ను ప‌ట్టిస్తే రూ.10 ల‌క్ష‌లు

Published on Fri, 10/25/2024 - 11:14

ముంబై: గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. అలాగే అన్మోల్‌ను పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. కాగా గత ఏప్రిల్‌లో ముంబైలోని బాలీవుడ్‌ నటుడు సల్మీన్‌ ఖాన్‌ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో అన్మోల్‌కు ప్రమేయం ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే.  ముంబై పోలీసులు అన్మోల్‌పై  లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ ఫైరింగ్‌కు పాల్ప‌డింది తామే అని అత‌ను సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించాడు.

కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య వంటి కారణాలతో లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్‌ పేరు మారుమోగుతోంది. బాబా సిద్దిఖీ హత్యతో అన్మోల్‌ బిష్ణోయ్‌ పేరు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అన్మోల్‌ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు

అన్మోల్‌ బిష్ణోయ్‌ని అలియాస్ భానుగా పిలుస్తారు. గత ఏడాది నకిలీ పాస్‌పోర్ట్‌తో భారత్‌ నుంచి పారిపోయిన అన్మోల్‌.. అనంతరం కెన్యా, కెనడాలో గుర్తించారు. ప్రస్తుతం అతడు కెనడాలో నివసిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబీ సింగ‌ర్ సిద్దూ మోసేవాల్ హ‌త్య కేసులో అన్మోల్‌ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. మరోవైపు లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)