Breaking News

ఏబీసీ చైర్మన్‌గా రియాద్‌ మాథ్యూ

Published on Fri, 09/20/2024 - 05:05

న్యూఢిల్లీ: పత్రికల సర్క్యులేషన్‌ను మదింపు చేసి.. ధ్రువీకరించే ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ)కి చైర్మన్‌గా మలయాళ మనోరమకు చెందిన రియాద్‌ మాథ్యూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024–25 సంవత్సరానికి ఆయన ఏబీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. చీఫ్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ అయిన మాథ్యూ మలయాళ మనోరమ గ్రూపు డైరెక్టర్‌ కూడా. మాథ్యూ పీటీఐ వార్తా సంస్థ బోర్డులో కూడా 2009 నుంచి డైరెక్టర్‌గా ఉన్నారు. కరుణేష్‌ బజాజ్‌ (ఐటీసీ) డిప్యూటీ ౖచైర్మన్‌గా ఎన్నిక కాగా, మోహిత్‌ జైన్‌ కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. యాడ్‌ ఏజెన్సీల ప్రతినిధి విక్రమ్‌ సఖుజా కోశాధికారిగా తిరిగి ఎన్నికయ్యారు. 2024–25 సంవత్సరానికి ఏబీసీ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌లోని సభ్యుల వివరాలు.. 

పబ్లిషర్స్‌ ప్రతినిధులు: రియాద్‌ మాథ్యూ (మలయాళ మనోరమ), ప్రతాప్‌ జి.పవార్‌ (సకాల్‌ పేపర్స్‌), శైలేష్‌ గుప్తా (జాగరణ్‌ ప్రకాశన్‌ లిమిటెడ్‌), ప్రవీణ్‌ సోమేశ్వర్‌ (హెచ్‌టి మీడియా లిమిటెడ్‌), మోహిత్‌ జైన్‌ (బెన్నెట్, కోల్‌మన్‌ అండ్‌ కంపెనీ లిమిటెడ్‌), ధ్రువ ముఖర్జీ (ఏబీపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌), కరణ్‌ దర్దా (లోక్‌మత్‌ మీడియా ప్రై. లిమిటెడ్‌), గిరీష్‌ అగర్వాల్‌ (డీబీ కార్ప్‌ లిమిటెడ్‌). ప్రకటనకర్తల ప్రతినిధులు: కరుణేష్‌ బజాజ్‌ (ఐటీసీ లిమిటెడ్‌), అనిరుధ హల్దార్‌ (టీవీఎస్‌ మోటర్స్‌ కంపెనీ లిమిటెడ్‌), పార్థో బెనర్జీ (మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌). 

యాడ్‌ ఏజెన్సీల ప్రతినిధులు: శ్రీనివాసన్‌ కె.స్వామి (ఆర్‌కే స్వామి లిమిటెడ్‌), విక్రమ్‌ సఖుజా (మాడిసన్‌ కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌), ప్రశాంత్‌ కుమార్‌ (గ్రూప్‌ ఎం మీడియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌), వైశాలి వర్మ (ఇనీíÙయేటివ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌), సేజల్‌ షా (పబ్లిక్స్‌ మీడియా ఇండియా గ్రూపు).

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)