Breaking News

వంట నూనె ధరలకు రెక్కలు

Published on Sun, 10/27/2024 - 06:32

సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు మొదలవుతున్న వేళ వంటనూనెల ధరలు చుక్కలనంటుతున్నాయి. గడిచిన నెల రోజులుగా క్రమంగా పెరుగుతూ సామాన్యులకు అందనంతగా పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లోనే వంట నూనెల ధరలు 23 నుంచి 37 శాతం వరకు పెరగడంతో పండగ వేళ సామాన్యులకు ఇక్కట్లు తప్పేలా లేవు. 

ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత నెలలో రూ.100 ఉన్న పామాయిల్‌ ధర రూ.137 (37 శాతం) పెరగ్గా, సోయాబీన్‌ నూనె రూ.120 నుంచి రూ.148 (23 శాతం), సన్‌ఫ్లవర్‌ రూ.120 నుంచి రూ.149 (23.5 శాతం), ఆవ నూనె రూ.140 నుంచి రూ.181 (29శాతం), వేరుశనగ నూనె రూ.180 నుంచి రూ.187 (4 శాతం) మేర పెరిగాయి. దేశీయంగా నూనెగింజల సాగు పెద్దగా లేకపోవడంతో దేశం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. 

ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా నుంచి సన్‌ఫ్లవర్‌ నూనెను దిగుమతి చేసుకుంటోంది. మొత్తంగా 58 శాతం ఇతర దేశాల నుంచే భారత్‌కు వస్తోంది. నూనెల వినియోగంలో భారత్‌ రెండో అతిపెద్ద వినియోగదారుగా ఉంది. దేశీయంగా నూనె పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గత నెలలో ముడి సోయాబీన్, పామాయిల్, సన్‌ఫ్లవర్‌ నూనెల దిగుమతి సుంకాలను 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచింది. 

శుధ్ది చేయబడిన ఆవ నూనెల దిగుమతి సుంకాన్ని 13.7 శాతం నుంచి  35.7 శాతానికి పెంచింది. సెపె్టంబర్‌ 14 నుంచి పెరిగిన సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హోల్‌సేల్‌ వ్యాపారులు ధరలు పెంచి అమ్మకాలు చేపట్టారు. దీనితో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు నూనెగింజల సాగులో ముందున్న మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పంట ఉత్పత్తి తగ్గింది.

 ఈ ప్రభావం సైతం ధరల పెరుగుదలకు కారణమైంది. పెరిగిన ధరల ప్రభావం రెస్టారెంట్‌లు, హోటళ్లతో పాటు దీపావళి సందర్భంగా చేసుకునే తీపి పదార్థలపై గణనీయంగా పడుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో స్వీట్ల ధరలను పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కొత్త పంట మార్కెట్‌లోకి వచ్చే వరకు ధరలు దిగిరావని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)