Breaking News

బ్యాలెట్‌ పేపర్లు.. మీ పరిధి కాదు

Published on Sun, 03/02/2025 - 06:25

న్యూఢిల్లీ: ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్‌ పేపర్లను ప్రవేశపెట్టాలన్న అంశం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిధిలోకి రాదని కేంద్ర న్యాయ శాఖ తేల్చిచెప్పింది. జమిలి ఎన్నికల బిల్లుపై ఏర్పాటైన జేపీసీకి ఈ మేరకు రాతపూర్వకంగా తన అభిప్రాయాన్ని తెలియజేసింది. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించే విధానాన్ని మళ్లీ తీసుకురావాలని కమిటీలోని కొందరు సభ్యులు సూచించగా, కేంద్ర న్యాయశాఖ దీనిపై స్పందించింది. 

ఈ అంశం జేపీసీ పరిధిలోకి రాదని పేర్కొంది. ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించాలా? లేక బ్యాలెట్‌ పేపర్లతో నిర్వహించాలా? అనేది పరిశీలించే అధికారం జేపీసీకి లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. జమిలి ఎన్నికలు అప్రజాస్వామికం కాదని స్పష్టంచేసింది. ఈ ఎన్నికల వల్ల దేశ సమాఖ్య నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగదని పేర్కొంది. బ్యాలెట్‌ పేపర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించింది. సుప్రీంకోర్టు సైతం ఈవీఎంలౖవైపే మొగ్గు చూపుతోంది. పేపర్‌ బ్యాలెట్‌ విధానాన్ని మళ్లీ తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.   

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)