Breaking News

సర్వీస్‌ చార్జీ స్వచ్ఛందమే

Published on Sat, 03/29/2025 - 05:39

న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్‌ చార్జీల పేరుతో అదనంగా వసూలు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తప్పుబట్టింది. వినియోగదారులు సర్వీస్‌ చార్జీలను స్వచ్ఛందంగా ఇవ్వాల్సిందే తప్ప వారి నుంచి బలవంతంగా వసూలు చేయజాలవని స్పష్టం చేసింది. బిల్లుపై అదనంగా సర్వీస్‌ చార్జీలంటూ వసూలు చేయరాదన్న సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సీసీపీఏ) నిబంధనలను సవాల్‌ చేస్తూ రెస్తారెంట్ల సంఘాలు వేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభా ఎం.సింగ్‌ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ‘‘కస్టమర్లకు ఇష్టమైతే టిప్‌ ఇవ్వొచ్చు. అంతేతప్ప సర్వీస్‌ చార్జీలంటూ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. 

అసలు బిల్లులో కలపని ఈ మొత్తాన్ని జీఎస్‌టీ లేదా సర్వీస్‌ ట్యాక్స్‌ అని కస్టమర్లు భావించే అవకాశముంది. ఇది మోసమే అవుతుంది’’ అని జడ్జి పేర్కొన్నారు. పిటిషన్‌దారులైన ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ), నేషనల్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆండియా(ఎన్‌ఆర్‌ఏఐ)లకు చెరో రూ.లక్ష చొప్పున జరిమానా సైతం విధించారు. వినియోగదారుల సంక్షేమానికి ఉపయోగపడేలా ఈ మొత్తాన్ని సీపీపీఏ ఖాతాలో జమ చేయాలన్నారు. రెస్టారెంట్ల హక్కుల కంటే వినియోగదారుల హక్కులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తేల్చి చెప్పారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు