Breaking News

ఎల్గార్‌ కేసులో  విల్సన్, ధావలెకు బెయిల్‌

Published on Sat, 01/25/2025 - 06:06

ముంబై: ఎల్గార్‌ పరిషత్‌– మావోయిస్టుల లింకు కేసులో పరిశోధకుడు రొనా విల్సన్, ఉద్యమకారుడు సుధీర్‌ ధావలె దాదాపు ఆరేళ్ల అనంతరం శుక్రవారం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. వీరిద్దరికీ ఈ నెల 8వ తేదీన బాంబే హైకోర్టు బెయిలిచ్చింది. ‘వీరు 2018 నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. వీరిపై ఇప్పటికీ ఆరోపణలను నమోదు చేయలేదు. ఈ కేసులో 300 మంది సాక్ష్యులను విచారించాల్సి ఉందని ఎన్‌ఐఏ అంటోంది. ఈ దృష్ట్యా కేసు విచారణ కనీస భవిష్యత్తులో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు’అని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

 విల్సన్, ధావలెలు శుక్రవారం ఎన్‌ఐఏ కోర్టులో బెయిల్‌కు సంబంధించిన లాంఛనాలు పూర్తి చేసి తలోజా జైలు నుంచి విడుదలయ్యారు. 2017 డిసెంబర్‌ 31వ తేదీన పుణేలో జరిగిన ఎల్గార్‌ పరిషత్‌ సమావేశంలో చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలే ఆ తర్వాత కోరెగావ్‌–భీమాలో హింసాత్మక ఘటనలకు దారి తీసినట్లు కేసు నమోదైంది. వీరికి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉద్యమకారులు, విద్యావేత్తలు సహా14 మందిని అరెస్ట్‌ చేశారు. వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్‌ తెల్తుండే, అరుణ్‌ ఫెరీరా తదితర 8 మంది విడుదలయ్యారు. మహేశ్‌ రౌత్‌ పెట్టుకున్న బెయిల్‌కు వ్యతిరేకంగా ఎన్‌ఐఏ వేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ఆయన జైలులోనే ఉన్నారు. స్టాన్‌ స్వామి అనే క్రైస్తవ ప్రబోధకుడు జైలులోనే 2021లో చనిపోయారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)