Breaking News

‘హైపర్‌ లూప్‌’పై పరిశోధన

Published on Sun, 10/27/2024 - 05:40

సాక్షి, చెన్నై: రవాణా వ్యవస్థలో అతి వేగంగా దూసుకెళ్లే హైపర్‌ లూప్‌ టెక్నాలజీ రైలు సేవల మీద ఐఐటీ తయ్యూరు క్యాంపస్‌లో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. చెన్నై మెట్రో రైలు, ఐఐటీ సంయుక్తంగా ఈ పరిశోధన మీద దృష్టి పెట్టింది. ఇది విజయవంతమైతే చెన్నై విమానా­శ్రయం నుంచి కొత్తగా నిర్మించబోతున్న పరందూరుకు 15 నిమిషాల వ్యవధిలో దూసుకెళ్లే అవకాశం ఉంది. 

చెన్నైకు ప్రత్యామ్నా­యంగా కాంచీపురం పరిధిలోని పరందూరులో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో చెన్నై విమానాశ్రయం నుంచి పరందూరు వైపుగా మెట్రో సేవలకు సైతం ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. పూందమల్లి వరకు ఉన్న మెట్రో రైలు సేవలను పరందూరు వరకు పొడిగించే విధంగా కార్యాచరణ చేపట్టనున్నారు. 

మెట్రో మార్గంలో చెన్నై నుంచి పరందూరుకు గంట సమ­యం పడుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో అతివేగంగా దూసుకెళ్లే హైపర్‌ లూప్‌ టెక్నాలజీ ద్వారా చెన్నై–పరందూరు మధ్య 15 నిమిషాల్లో చేరుకునేలా కొత్తమార్గంపై దృష్టి పెట్టనున్నారు. ఈ టెక్నాలజీ మీద ఐఐటీ తయ్యూరు క్యాంప్‌ పరిశో­ధకులు, విద్యార్థులు కొంతమేరకు పరిశోధ­నలో ఫలితాలు సాధించినట్టు సమాచారం. 

అసలేంటీ ‘హైపర్‌ లూప్‌’
లూప్‌ అనేది  పైప్‌లైన్‌లాంటి మార్గం. పాట్‌ అనే రైలు పెట్టె లాంటి వాహనంలో వాయువేగంలో దూసుకెళ్లే విధంగా ఈ టెక్నాలజీ ఉంటుంది. అయస్కాంతం సహకారంతో గాల్లో వేలాడుతూ గంటకు 600 కి.మీ వేగంతో ఈ హైపర్‌ లూప్‌ అతి వేగంగా దూసుకెళ్తుందని చెబుతున్నారు. ఈ హైపర్‌ లూప్‌లో ఒకే సమయంలో 40 మంది ప్రయాణించేందుకు వీలుంటుందని సమాచారం

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)