Breaking News

Delhi: సీఎం రేఖా గుప్తా మీటింగ్‌లో భర్త.. మండిపడుతున్న ‘ఆప్‌’

Published on Mon, 09/08/2025 - 10:56

న్యూఢిల్లీ:ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమె భర్త, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త మనీష్ గుప్తా ప్రభుత్వ సమావేశంలో ఆమె పక్కన కూర్చోవడంతో ఢిల్లీ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించడానికి జరిగిన సమావేశానికి మనీష్ గుప్తా  హాజరయ్యారు.

సమావేశంలో సీఎం రేఖా గుప్తా భర్త పసుపు రంగు చొక్కా ధరించి, ఆమె పక్కన కనిపిస్తున్నారు.  ఇది ప్రతిపక్ష నేతల దృష్టిని ఆకర్షించింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్‌ఛార్జ్ సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ, ఢిల్లీ ప్రభుత్వంలో  రేఖా గుప్తా  భర్త మనీష్‌ భాగస్వామి కానప్పుడు అతనిని  అధికారిక సమావేశంలో కూర్చొనేందుకు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేసే చర్య అని ఆయన ‘ఎక్స్‌’ పోస్టులో  రాశారు.

కాంగ్రెస్‌లో వంశపారంపర్య రాజకీయాలున్నాయన్న బీజేపీ ఇప్పుడు సీఎం రేఖా గుప్తా విషయంలో ఏమి మాట్లాడుతుందన్నారు. ముఖ్యమంత్రి తన భర్తకు అధికారాలు ఇవ్వాలనుకుంటున్నారని ఆరోపించారు. ఆప్ నేత సంజయ్ సింగ్ కూడా  రేఖా గుప్తాను విమర్శిస్తూ, ప్రధాని మోదీ ఢిల్లీలో ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించారని అన్నారు. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయితే, ఆమె భర్త సూపర్ ముఖ్యమంత్రి అని విమర్శించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)