Breaking News

చార్‌ధామ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్‌ షురూ!

Published on Mon, 04/15/2024 - 06:53

చార్‌ధామ్‌ యాత్రకు నేటి (సోమవారం) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్ ఓపెన్‌ కానుంది. దీంతోపాటు మొబైల్ యాప్, వాట్సాప్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం  అందుబాటులో ఉండనుంది. 

కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలను సందర్శించే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పర్యాటక శాఖ చార్‌ధామ్‌ రిజిస్ట్రేషన్ కోసం సన్నాహాలు పూర్తి చేసింది. ఈసారి చార్‌ధామ్ యాత్ర ప్రారంభానికి 25 రోజుల ముందు నుంచే యాత్రికులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. తద్వారా వారు తమ ప్రయాణ ప్రణాళికలను తగిన విధంగా రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. రిజిస్ట్రేషన్ కోసం యాత్రికులు తమ వివరాలతో పాటు మొబైల్ నంబర్, చిరునామాను జతచేయాలి.

పర్యాటక శాఖ వెబ్‌సైట్  registrationandtouristcare.uk.gov.inకు లాగిన్ అయి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్‌ నంబర్ 8394833833కు యాత్ర అని రాసి సందేశం పంపడం ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకునే అవకాశం లేని ప్రయాణికులు పర్యాటక శాఖ టోల్ ఫ్రీ నంబర్  01351364కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. 

గత ఏడాది 74 లక్షల మంది యాత్రికులు చార్‌ధామ్‌ యాత్రకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 56 లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించారు. ఈసారి కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండవచ్చని పర్యాటకశాఖ అంచనా వేస్తోంది. మే 10 నుంచి చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కానుంది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)