రక్షిత వృక్ష జాతుల్లో ఎర్రచందనం 

Published on Fri, 12/15/2023 - 05:29

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో మా­త్రమే పెరిగే ఎర్రచందనం వృక్షాలను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత వృక్ష జాతిగా,  అరుదైన చెట్లున్న ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే తెలిపారు. వైఎస్సార్‌ కాం­గ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అంతరించిపోతున్న జంతు, వృక్ష జాతుల అంతర్జాతీయ వాణిజ్య ఒడంబడిక జాబి­తాలో ఎర్రచందనాన్ని చేర్చిన కారణంగా ఇది అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రిస్తుందని చెప్పా­రు.

కన్వెన్షన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎన్‌డేంజరస్‌ స్పీసెస్‌ (సెట్స్‌) స్టాండింగ్‌ కమిటీ ఎర్రచందనాన్ని ముఖ్య­మైన వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించాలని సూచించిందన్నారు. గ్రామీణ ప్రజలు, చిన్న, సన్నకారు రైతులకు ఉపాధి, ఆదా­య మా­ర్గాల సృష్టి, ఉత్పాదకత మెరుగుపరచడానికి పరిపూర్ణమైన, సమగ్ర పద్ధతిలో చెట్ల పెంపకాన్ని విస్తరించే లక్ష్యంతో ఆగ్రో ఫారెస్ట్రీని ప్రో­త్స­హించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని చె­ప్పా­రు. ఆగ్రో ఫారెస్ట్రీలో భాగంగా ఎర్రచందనం, టేకు వంటి వృక్ష జాతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 

పులికాట్‌ సరస్సు నిర్వహణకు ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని పులికాట్‌ సరస్సు సహా చిత్తడి నేలల నిర్వహణకు ఇంటిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ (ఐఎంపీ) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు మంత్రి అశ్వినికుమార్‌ చౌబే తెలిపారు. రాయదొరువు వద్ద సరస్సు ప్రవేశద్వారం నీటి ప్రవాహాన్ని అధ్యయనం చేయడంతోపాటు, ఇతరత్రా రక్షణ చర్యలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయని వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు.

ఆ న్యాయమూర్తుల వివరాలు ప్రత్యేకంగా లేవు
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో ఎలాంటి రిజర్వేషన్లు లేవని, అందువల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తుల వివరాలేమీ ప్రత్యేకంగా నిర్వహించడం లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్ర బోస్, ఆర్‌.కృష్ణయ్య ప్రశ్నకు మంత్రి ఈమేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 

Videos

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)