Breaking News

వన్యప్రాణులున్నాయి జాగ్రత్త.. వాహనదారులకు రెడ్‌ అలర్ట్‌!

Published on Fri, 12/12/2025 - 02:06

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌:  ఏంటిది.. హైవేపై ఈ ఎర్రటి గుర్తులేంటని ఆశ్చర్యపోతున్నారా? దేశంలోనే తొలిసారిగా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌–భోపాల్‌ జాతీయ రహదారిపై వేసిన రెడ్‌ టేబుల్‌ టాప్‌ మార్కింగ్స్‌ ఇవి. ఈ హైవేలోని 12 కిలోమీటర్ల మార్గం వీరంగనా దుర్గావతి టైగర్‌ రిజర్వ్, నౌరాదేహి వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీ మీదుగా సాగుతుండటంతో అతివేగంగా వచ్చే వాహనా లు ఢీకొని జింకలు, నక్కలు, దుప్పుల వంటి వన్యప్రాణులు తరచూ ప్రమా దాలకు గురవుతున్నాయి. 

ఇక్కడ మూల మలుపులు కూడా ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు దాటే వన్యప్రాణులు వాహనదారులకు అతిసమీపానికి వచ్చే దాకా కనిపించడంలేదు. ఈ సమస్యలకు పరిష్కారంగా నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ వినూత్న ప్రయోగానికి తెరతీసింది. మొత్తం 12 కి.మీ. మార్గంలో రెడ్‌ మార్కింగ్స్‌ వేయడంతోపాటు అందులోని 2 కి.మీ. మార్గంలో ప్రత్యేకంగా 5 మిల్లీమీటర్ల మేర కాస్త ఉబ్బెత్తుగా ఉండేలా ఎర్రటి మార్కింగ్స్‌ వేసింది. దీనివల్ల వాహనదారులు ఈ 12 కి.మీ. మార్గంలోకి ప్రవేశించగానే వన్యప్రాణులు రోడ్డు దాటొచ్చని వారు అప్రమత్తమయ్యేందుకు వీలవుతోంది. 


ముఖ్యంగా 2 కి.మీ. దూరంపాటు ఉబ్బెత్తుగా వేసిన మార్కింగ్స్‌ వల్ల వాహనదారులు స్వల్పంగా కుదుపులకు గురవుతూ వాహ నాలను నెమ్మదిగా నడపడం సాధ్యమ వుతోంది. ఫలితంగా వన్యప్రాణులకు గతంతో పోలిస్తే సురక్షితంగా రోడ్డు దాటేందుకు మార్గం సుగమమైంది. అలాగే వన్యప్రాణులు సాఫీగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ హైవేపై 25 చోట్ల అండర్‌పాస్‌లను కూడా ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించింది.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)