దహనానికి ముందే కుప్పకూలిన రావణుడు

Published on Sat, 10/12/2024 - 09:28

కోటా: రాజస్థాన్‌లోని కోటాలో జరిగే దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా  ఎంతో గుర్తింపు పొందాయి. కోటా నగరంలోని దసరా మైదానం ఉత్సవాలకు ముస్తాబయ్యింది. అయితే ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర నిరాశకు గురయ్యారు.  

65 అడుగుల ఎత్తయిన రావణాసురిని దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధం చేసినప్పటికీ, అది దహనం చేయడానికి ముందే నిట్టనిలువునా కూలిపోయింది. రావణాసురిని దిష్టిబొమ్మను నిలబెట్టేందుకు ఉపయోగించిన బెల్టు తెగిపోవడంతో ఒక్కసారిగా రావణాసురుని బొమ్మ కూలిపోయింది. దాదాపు నెల రోజుల పాటు శ్రమించి రావణుని దిష్టిబొమ్మను దహనం కోసం సిద్ధం చేశారు.

క్రేన్ సాయంతో ఆ రావణాసురుని బొమ్మను  నిలబెడుతుండగా ఒక్కసారిగా శబ్ధం చేసుకుంటూ అది కిందపడిపోయింది. రావణాసురుని దిష్టిబొమ్మ పడిపోయిన నేపధ్యంలో దాని వెనుక భాగం దెబ్బతింది. దీంతో దిష్టిబొమ్మకు మరమ్మతులు చేసి, దానిని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం ఖురేషి మాట్లాడుతూ రావణుని దిష్టిబొమ్మను ఢిల్లీ నుంచి వచ్చిన కళాకారులు రూపొందించారని తెలిపారు. కుంభకర్ణుడు, మేఘనాథుని దిష్టిబొమ్మలను ఇప్పటికే మైదానంలో నిలబెట్టారు. రావణుని దిష్టిబొమ్మను నిలబెట్టే సమయంలో అది ఒక్కసారిగా కూలిపోయింది. దానిని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఖురేషి తెలిపారు.

ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌: దుర్గాపూజలో చెలరేగిన హింస

Videos

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)