Breaking News

పెంపుడు శునకాలు అనారోగ్యంతో ఉన్నాయని..

Published on Thu, 10/10/2024 - 09:14

న్యూఢిల్లీ: రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేరు. అయితే అతని జ్ఞాపకాలు, రచనలు  నిత్యం మనతోనే ఉంటాయి. రతన్ టాటా చూపిన దాతృత్వానికి సంబంధించిన అనేక ఉదాహణలు మనకు కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్త సుహైల్ సేథ్.. రతన్‌ టాటా చాటిన మానవత్వానికి సంబంధించిన ఒక ఘటనను పంచుకున్నారు.

ఫిబ్రవరి 2018లో బ్రిటీష్ రాజకుటుంబం రతన్ టాటాను లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించాలనుకుంటున్నట్లు సుహైల్ సేథ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రిన్స్ చార్లెస్ స్వయంగా రతన్‌ టాటాకు ఈ బిరుదును ఇవ్వాలనుకున్నారు. అయితే రతన్ టాటా బ్రిటన్‌ వచ్చేందుకు నిరాకరించారు. అయితే దీని వెనుకగల కారణాన్ని తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్ రతన్‌ టాటాను మానవతావాదిగా కొనియాడారు.

ఈ ఆసక్తికరమైన కథనాన్ని సుహైల్ సేథ్ వివరించారు.  2018, ఫిబ్రవరి 6న ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్‌లో రతన్ టాటాను లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించాలనుకున్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలని భావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుహైల్‌ సేథ్‌  ఫిబ్రవరి 3న లండన్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ సమయంలో సుహైల్‌ సేథ్‌ తన ఫోన్‌ని  చూసుకున్నప్పుడు అతని మొబైల్‌ ఫోన్‌లో రతన్ టాటా నుండి 11 మిస్డ్ కాల్స్  ఉన్నాయి. వీటిని చూసిన సుహైల్‌ సేథ్‌ వెంటనే రతన్ టాటాకు ఫోన్ చేయగా, రతన్‌ టాటా తాను ఆ అవార్డుల ఫంక్షన్‌కి రాలేనని చెప్పారు. తన పెంపుడు శునకాలు టాంగో, టిటోలు అనారోగ్యంతో ఉన్నాయని వాటిని విడిచిపెట్టి, ఈ అవార్డుల ఫంక్షన్‌కి రాలేనని చెప్పారు.  ఈ సమాధానం విన్న సుహైల్‌ సేథ్‌ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్స్‌ చార్లెస్‌.. రతన్‌ టాటాను మానవత్వం కలిగిన మహనీయునిగా జంతు ప్రేమికునిగా పేర్కొన్నారు.
 

ఇది కూడా చదవండి: నా స్నేహితుడు, మంచి మనిషి: మోదీపై ట్రంప్‌ ప్రశంసలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)