Breaking News

లేత గోధుమ రంగులో మెరిసిన అరుదైన చిరుత..

Published on Sun, 01/04/2026 - 11:53

ఈ చిత్రంలో కనిపిస్తున్న చిరుత దేశంలోనే అత్యంత అరుదైన రకానికి చెందినది. సాధారణ చిరుతలు ముదురు నల్లరంగు మచ్చలతో కనిపిస్తే ఈ చిరుత మాత్రం లేత గోధుమ వర్ణం శరీరంతో లేత గులాబీ మచ్చలతో దర్శనమిచ్చింది. కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో తిరుగుతూ ఇలా ట్రాప్‌ కెమెరాకు చిక్కింది. 

హోలేమట్టి నేచర్‌ ఫౌండేషన్‌కు చెందిన వన్యప్రాణి శాస్త్రవేత్త సంజయ్‌ గుబ్బి, ఆయన బృందం ట్రాప్‌ కెమెరాల చిత్రాల ఆధారంగా దీన్ని అరుదైన చిరుతపులిగా తేల్చింది. ఇది ఆడ చిరుత అని.. దీని వయసు సుమారు ఆరేళ్లు ఉండొచ్చని అంచనా వేసింది. రాజస్తాన్‌లోని రణక్‌పూర్‌ ప్రాంతంలో 2021లో ఇలాంటి చిరుత కనిపించగా కర్ణాటకలో ఈ తరహా చిరుత కనిపించడం ఇదే తొలిసారని పేర్కొంది. ఎరిథ్రిజం లేదా హైపోమెలనిజం అనే జన్యుపరమైన మార్పుల వల్ల చిరుత శరీర రంగు ఇలా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 దక్షిణాఫ్రికా, టాంజానియా తదితర ఆఫ్రికా దేశాల్లో అక్కడక్కడా అరుదుగా కనిపించే ఈ రంగు చిరుతలను స్థానికంగా ‘స్ట్రాబెర్రీ చిరుత’అని పిలుస్తున్నారు. అయితే సంజయ్‌ గుబ్బి బృందం మాత్రం దీనికి ‘శాండల్‌వుడ్‌ చిరుత’ అనే పేరును ప్రతిపాదించింది. కర్ణాటక గంధపు చెక్కలకు ప్రసిద్ధి చెందినందున ఈ పేరు ఆ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, ఇది ప్రాంతీయ పరిరక్షణ ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుందని ఈ పేరు పెట్టింది.    

#

Tags : 1

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు