Breaking News

సింపుల్ గా జాబ్‌ మారుతున్నారు!

Published on Mon, 11/10/2025 - 04:48

అసలే కుర్రకారు. వారి ఆలోచనలూ ఉడుకు రక్తంలా పరుగెడుతుంటాయి. ఉద్యోగం విషయంలోనూ అంతే. ఏళ్లకేళ్లు ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తూ కూర్చోవడానికి తాము ఒకప్పటి తరం కాదని తేల్చిచెబుతోంది జనరేషన్ –జీ. మంచి వేతనం దొరికితే ఏడాదిలోపే జంప్‌ చేస్తామని నిర్మొహమాటంగా కుండబద్దలు కొడుతున్నారీ తరం. విశ్వసనీయత, ఉద్యోగ స్థిరత్వం, కెరీర్‌ వృద్ధి.. ఇదంతా గతం. జీతం, పని సౌలభ్యం, వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్ఈ అంశాలే జెన్ –జీ తరానికి ఇప్పుడు కీలకంగా మారా­యని రాండ్‌స్టాడ్‌ ఇండియా తాజా నివేదిక చెబుతోంది. 

పనికి తగ్గ వేతనం జెన్ –జీ నిపుణులకు ఒక ప్రాథమిక డిమాండ్‌గా ఉన్నప్పటికీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా పని చేయాలన్న అంశా­లకూ విలువ ఇస్తున్నారని ‘ద  జెన్ –జీ వర్క్‌ప్లేస్‌ బ్లూప్రింట్‌’ పేరుతో రూపొందిన   ఈ నివేదిక తెలిపింది. 1997–2007 మధ్య జన్మించిన జెన్ –జీ బ్యాచ్‌లో 35 కోట్ల మందికిపైగా ఉన్నారు. భారత జనాభాలో వీరి వాటా దాదాపు 27%.

వృద్ధిని కోరుకుంటున్నారు
అదనపు సెలవు, పదవీ విరమణ ప్రయోజనాలు వంటి సంప్రదాయ ప్రోత్సాహకాలు జెన్‌ జీని పెద్దగా ఆకర్షించడం లేదు. వీటికి బదులుగా అర్థవంతమైన పని, అభ్యాస అవకాశాలను ఈ తరం కోరుకుంటోంది. చాలామంది ప్రయాణ అవకాశాలు, రిమోట్‌ గా పని చేసే సౌకర్యాలు ఉన్న కంపెనీల్లో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. 

తరచూ కంపెనీలు మారడం తప్పుకాదనీ, సుదీ ర్ఘ ప్రయాణంలో భాగంగా వారు వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఎదగడానికి అవకాశాల కోసం చూ­స్తున్నందున తరచూ ఉద్యోగం మారుతున్నారని తెలిపింది. 

మారాల్సింది కంపెనీలే!
కంపెనీలు ఈ మార్పులకు అనుగుణంగా మారాలని నివేదిక సూచించింది. ఉద్యోగుల పనితీరు మెరుగుపరిచే అవకాశాలు కల్పించడం, మార్గదర్శకత్వం, వారితో మమేకం కావడం, సౌకర్యవంతమైన పని వాతావరణం వంటివి అమలు చేసే కంపెనీలు జెన్‌–జీ ప్రతిభను ఆకర్షించడమే కాకుండా.. దీర్ఘకాలం పాటు వీరిని తమ సంస్థల్లో ఉద్యోగులుగా నిలుపుకో­గలుగుతాయని వివరించింది. 

అవకాశాలు బోలెడున్నాయని వారు దృఢ నిశ్చయంతో ఉన్నారని నివేదిక తెలిపింది. ఈ తరుణంలో ఉద్యోగావకాశాలు, అభివృద్ధి మార్గాలను ఈ జనరేషన్  కోసం ఎలా రూపొందించాలో కంపెనీలు పునరాలోచించుకోవాలని సూచించింది. 

బేరీజు వేసుకుని మరీ..
మెరుగైన అవకాశాలపై దృష్టి సారించినప్పటికీ తమ ఉద్యోగం / పాత్రలో తాము సమర్థులుగా భావిస్తున్నామని 81% మంది చెబుతున్నారు. 93% మిలీనియల్స్, 89% జెన్ –ఎక్స్‌తో పోలిస్తే 82% జెన్ –జీ తరం మాత్రమే తమ కంపెనీలో తమకు విలువ ఉందని భావిస్తున్నారు. 

94% కంటే ఎక్కువ మంది కొత్త కంపెనీని ఎంచుకునే ముందు తమ దీర్ఘకాలిక ఆకాంక్షలకు తగ్గట్టుగా నూతన ఉద్యోగం ఉందా లేదా అని బేరీజు వేసుకుంటున్నారట. ప్రపంచవ్యాప్తంగా జెన్ –జీ తరంలో ఇలా ఆలోచించేవారి శాతం సగటు 79%.   

#

Tags : 1

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)