Breaking News

నేడు ఆలయ ప్రాంగణంలోకి బాలరాముని విగ్రహం!

Published on Wed, 01/17/2024 - 06:55

ఈ నెల 22న జరగబోయే బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. మంగళవారం ప్రాయశ్చిత్త పూజలతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా ప్రాయశ్చిత్త పూజలను నిర్వహించారు. 

సుమారు మూడు గంటల పాటు ఈ ప్రాయశ్చిత్త పూజలు జరిగాయి. అనంతరం డాక్టర్ అనిల్ మిశ్రా సరయూ నదిలో పుణ్యస్నానం చేశారు. తరువాత విగ్రహ నిర్మాణ స్థలంలోనూ పూజలు చేశారు. బాలరాముని విగ్రహాన్ని శుద్ధి చేస్తూ, కళ్లకు గంతలు కట్టారు. వీటిని జనవరి 22న తెరవనున్నారు.

వివేక్ సృష్టి ప్రాంగణంలో ఆచార్య అరుణ్ దీక్షిత్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం  ఒంటిగంటకు ప్రాయశ్చిత్త పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన అతిథి డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు పూజలు ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో శిల్పి అరుణ్ యోగిరాజ్ కూడా పాల్గొన్నారు. ప్రాయశ్చిత్త పూజలో భగవంతుడిని క్షమాపణలు కోరారు. విగ్రహ తయారీలో ఉలి, సుత్తి లేదా మరేదైనా పరికరాన్ని ఉపయోగించినందున భగవంతునికి గాయం తగిలిందన్న భావనతో ఈ విధమైన క్షమాపణలు కోరారు..

అనంతరం ప్రధాన అతిథి డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు సరయూ తీరానికి చేరుకుని దశవిధ స్నానం చేశారు. ఈ సమయంలో ప్రాయశ్చిత్త పూజలకు సంబంధించిన మంత్రోచ్ఛారణలు ప్రతిధ్వనించాయి. ఈరోజు (బుధవారం) బాలరాముని విగ్రహాన్ని అయోధ్య ఆలయ ‍ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మించిన యాగ మండపంలో పూజలు ప్రారంభమవుతాయి.
ఇది కూడా చదవండి: అయోధ్యలో సంప్రదాయ క్రతువులు ఆరంభం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)