Breaking News

Ayodhya: బాలక్‌ రామ్‌ కోసం.. రెండో రోజూ అవే దృశ్యాలు

Published on Wed, 01/24/2024 - 08:34

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట అనంతరం రెండో రోజు.. నేడు (బుధవారం) బాలక్‌ రామ్‌ దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు  అంటే (నిన్న) మంగళవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఆలయాన్ని ఉదయం ఏడు గంటలకు తెరవనుండగా, తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు బారులు తీరారు.

ప్రాణ ప్రతిష్ట జరిగిన మర్నాడు అంటే మంగళవారం ఐదు లక్షల మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. భద్రతా ఏర్పాట్లు సజావుగా సాగేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా మంగళవారం సాయంత్రం అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యకు తరలివస్తున్న భక్తులు బాలరాముని దర్శనం కోసం ఓపిక పట్టాలని సీఎం కోరారు. 
 

ఇకపై రామాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరంతర దర్శనం ఉంటుందని జిల్లా యంత్రాంగం, శ్రీరామజన్మభూమి ట్రస్టు తెలిపింది. అయితే హారతి, భోగం కోసం సమయంలో దర్శనాన్ని కొద్దిసేపు నిలిపివేస్తున్నట్లు ట్రస్టు పేర్కొంది. 

ప్రాణ ప్రతిష్ట  అనంతరం సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించగా, తొలిరోజైన మంగళవారం నాడు ఐడు లక్షల మందికిపైగా భక్తులు తమ బాలరాముని దర్శించుకున్నారు. నేడు (బుధవారం) ఉదయం  ఇప్పటికే 20 వేల మందికి పైగా భక్తులు దర్శనం కోసం క్యూలో  ఉన్నారు. నేటి ఉదయం ప్రవేశ ద్వారం వెలుపల కిలోమీటరుకు పైగా భక్తుల క్యూలు కనిపించాయి. ఈ నేపధ్యంలో పోలీసులు, ఆలయ నిర్వాహకులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)