Breaking News

నవంబరు నాటికి రామ్‌లల్లా దర్బారు సిద్ధం!

Published on Mon, 03/11/2024 - 06:52

ఈ ఏడాది నవంబర్ నాటికి అయోధ్య రామాలయ మొదటి అంతస్తు (రామ్‌లల్లా దర్బారు) సిద్ధం కానున్నదని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. సర్క్యూట్ హౌస్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగానే రామమందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. 

నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, టెంపుల్ పార్కు, ఇతర సౌకర్యాల కోసం జరుగుతున్న పనులను పరిశీలించామని మిశ్రా తెలిపారు. ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారించామని, రామ్‌లల్లా దర్బారు నవంబర్ నాటికి పూర్తికానున్నదని పేర్కొన్నారు.

ఇదిలావుండగా అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ ప్రధాన కార్యాలయాన్ని రామనగరిలో నెలకొల్పనున్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్, అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయాల కోసం కొత్త భవనాలను నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీ టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్ ఆనంద్ మెహతా తెలిపారు. 

మార్చి నెలాఖరులోగా కాశీ-అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీసు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని కేవలం 55 నిమిషాల్లోనే పూర్తిచేయవచ్చు. ఒక్కో ప్రయాణికునికి ఛార్జీ రూ.14,159 చొప్పున వసూలు చేయనున్నారు. ఒక ట్రిప్పులో ఐదుగురు ప్రయాణించే అవకాశం ఉండనుంది. ఈ హెలికాప్టర్‌ సేవలను ఉత్తరాఖండ్‌కు చెందిన రాజాస్ ఏరోస్పోర్ట్ అండ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్‌ అందించనుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)