Breaking News

ప్రతీ శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుతం

Published on Sun, 01/07/2024 - 10:59

అయోధ్య.. శ్రీరాముడు కొలువైన నగరం. ఇక్కడ దైవత్వం, వైభవం, నూతనత్వం నిండుగా కనిపిస్తాయి. దీనికితోడు శ్రీరాముని మహా మందిరంలో, ఆయన విగ్రహంలోనూ అతీంద్రియ శక్తులు సంతరించుకున్నాయని ఆలయ ట్రస్టు తెలిపింది.

ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ ప్రతియేటా శ్రీరామనవమి నాడు సూర్య భగవానుడు స్వయంగా శ్రీరామునికి అభిషేకం చేయనున్నాడన్నారు. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తల సలహా మేరకు ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్ల పక్షంలో తొమ్మిదో రోజన సూర్యకిరణాలు శ్రీరాముని విగ్రహం నుదుటిపై పడేలా విగ్రహం పొడవు, ఎత్తును తీర్చిద్దిదారు. శ్రీరామనవమి నాడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామునికి సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడు. 

ముగ్గురు హస్తకళాకారులు వేర్వేరుగా శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేశారని, వాటిలో ఒక విగ్రహాన్ని భగవంతుని ప్రేరణతో ఎంపిక చేశారని చంపత్‌రాయ్‌ తెలిపారు. ఎంచుకున్న విగ్రహం పొడవు పాదాల నుండి నుదిటి వరకు 51 అంగుళాలు  ఉందని, విగ్రహం బరువు ఒకటిన్నర టన్నులు ఉందన్నారు. ఈ విగ్రహంలోని సౌమ్యతను వివరిస్తూ.. ముదురు రంగు రాతితో చేసిన విగ్రహంలో విష్ణుమూర్తి దివ్యత్వం, రాజకుమారుడి తేజస్సు మాత్రమే కాకుండా ఐదేళ్ల బాలుని అమాయకత్వం కూడా కపిస్తున్నదని తెలిపారు.

జనవరి 16 నుంచి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. జనవరి 18న గర్భగుడిలోని సింహాసనంపై శ్రీరాముని ప్రతిష్ఠించనున్నారు.ఈ శ్రీరాముని విగ్రహానికున్న ప్రత్యేకత ఏమిటంటే.. దానిని నీటితో, పాలతో స్నానం చేయించినా విగ్రహంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడదు. 

జనవరి 22న దేశవ్యాప్తంగా ఐదు లక్షల దేవాలయాల్లో అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయని, సాయంత్రం ప్రతి ఇంటి బయట కనీసం ఐదు దీపాలైనా వెలిగించాలని ట్రస్ట్‌ కోరింది. జనవరి 26 తర్వాతే దర్శనం కోసం సామాన్యులు ఆలయానికి రావాలని, రాత్రి 12 గంటలైనా అందరూ దర్శనం చేసుకునేంత వరకు ఆలయ తలుపులు తెరిచి ఉంచుతామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 
ఇది కూడా చదవండి: 22న పుట్టేవారంతా సీతారాములే..!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)