Breaking News

ఆ ఐదుగురు.. ‘ప్రాణ ప్రతిష్ఠ’ ప్రధాన అతిథులు!

Published on Tue, 01/09/2024 - 11:27

అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముడు ‍ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఈ నేపధ్యంలో ఇ‍ప్పటికే అయోధ్యలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి  హాజరయ్యే ఆచార్యులు, అతిథుల ఫైనల్‌ జాబితాను ఖరారు చేశారు. 

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన అతిథిగా హాజరుకానుండగా, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి, ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరు గర్భాలయంలో జరిగే పూజలలో పాల్గొననున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించారు.

ఇదిలా ఉండగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 న దేశ, ప్రపంచవ్యాప్తంగా  రామభక్తుల కోసం నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందించింది. దీని ప్రకారం జనవరి 14 నుంచి 22 వరకు దేవాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

జనవరి 22న వివిధ దేవాలయాలలో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం భక్తులు రామ జ్యోతులు వెలిగించనున్నారు.

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం బ్రహ్మ గణేశ్వర శాస్త్రి, ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్ సారధ్యంలో జరగనుంది. వీరితో పాటు సునీల్ దీక్షిత్, గజానంద్ జోగ్కర్, అనుపమ్ దీక్షిత్, ఘాటే గురూజీలు కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 
ఇది కూడా చదవండి: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)