Breaking News

కాశీ నుంచి అయోధ్యకు 50 క్వింటాళ్ల పూలు

Published on Sat, 01/20/2024 - 13:49

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి పూలను తెప్పించారు. అయోధ్యను అలంకరించేందుకు కాశీ నుంచి కూడా పూలు తెప్పించారు. పూర్వాంచల్‌లోని అతిపెద్ద పండ్ల మార్కెట్‌ నుంచి 50 క్వింటాళ్ల పూలను రెండు రోజుల క్రితం అయోధ్యకు తరలించారు.

ఈ పూలలో ఆరెంజ్‌, పసుపు రంగు బంతిపూలు ఉన్నాయి. ఇదేవిధంగా కాశీ నుంచి అయోధ్యకు పెద్ద మొత్తంలో గులాబీలను పంపించామని, పది వేల బంతిపూల దండలను కూడా పంపినట్లు మాల్దాహియా పూల మార్కెట్ హెడ్ విశాల్ దూబే తెలిపారు. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పటికీ, కొద్దిమొత్తంలోనే పూలను అయోధ్యకు పంపించామన్నారు. కాగా  కాన్పూర్, లక్నో, కోల్‌కతాల నుంచి కూడా అయోధ్యకు పూలను ఆర్డర్‌ చేశారు.

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యూపీలో ప్రస్తుతం పూలకు విపరీతమైన గిరాకీ ఉంది. జనవరి 22న వివిధ ఆలయాల్లో పూజలు, వేడుకలు నిర్వహించనున్న దృష్ట్యా వివిధ రకాల పూలకు ఎన్నడూ లేనంత డిమాండ్‌ ఏర్పడింది. బంతిపూలతో పాటు గులాబీ, మల్లె పూలకు విపరీతమైన ఆర్డర్లు అందుతున్నాయి.
ఇది కూడా చదవండి: బాలరామునికి భారీ వేణువు

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)