Breaking News

‘వందేమాతరం’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం 

Published on Thu, 07/30/2026 - 05:33

న్యూఢిల్లీ: జాతీయ గేయం వందేమాతరంను కించపరిచినా, గేయాన్ని పాడే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకపరిచినా, మరే విధంగా గేయం పవిత్రత, ప్రతిష్టను మంటగలిపేలా దుస్సాహసం చేసినా ఆ చర్యలన్నింటినీ ఇకపై తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తూ శిక్షలు విధించేలా జాతీయగేయంపై బిల్లును బుధవారం రాజ్యసభలో ఆమోదించారు. నీట్‌ పేపర్‌ లీకేజీ ఉదంతం, ఛలో సంసద్‌ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు కర్కశ వైఖరిలో మోదీ సర్కార్‌ బాధ్యత వహించాలన్న విపక్షాల డిమాండ్లు, నినాదాలతో రాజ్యసభలో గత వారంరోజులుగా సభాకార్యక్రమాలు ఆగిపోయినప్పటికీ ఎట్టకేలకు ఈ బిల్లుకు బుధవారం మోక్షం లభించింది.

 ఈ బిల్లుపై తొలుత రాజ్యసభలో చర్చ మొదలెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ సమాధానమిచ్చారు. జాతీయ గీతం జనగణమనకు ఉన్న హోదాను జాతీయగేయం వందేమాతరానికి ఇచ్చే ఉద్దేశంతో ఈ ‘జాతీయ గౌరవాల అవమానాల నివారణ (సవరణ)చట్టం, 2026’ను తీసుకొచ్చామని తెలిపారు. 

బిల్లుపై చర్చ సందర్భంగా నీట్‌ ఉదంతం, బిహార్‌లో ఉద్యమకారులపై ఏకే–47తో కాల్పుల ఘటనపై హోం మంత్రి సంజాయిషీ ఇవ్వాలని, ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని విపక్ష సభ్యులు పట్టుబడుతూ నినాదాలుచేశారు. దీంతో నినాదాల నడుమే సభలో మెజారిటీ సభ్యులు మూజువాణి ఓటుతో ‘వందేమాతరం’బిల్లును ఆమోదించారు. బిల్లు ప్రకారం ఇకపై జాతీయగేయాన్ని ఎవరైనా ఆలపిస్తుంటే అడ్డుకుంటే నేరంగా పరిగణించి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. జరిమానా సైతం విధిస్తారు. 1971నాటి పాత చట్టానికి సవరణలుచేసి ఈ బిల్లును తెచ్చారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)