Breaking News

సెప్టెంబర్‌ 3న రాజ్యసభ ఉప ఎన్నికలు

Published on Thu, 08/08/2024 - 06:04

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ 12 స్థానాలకు సెప్టెంబర్‌ 3న ఎన్నికలు జరుగనున్నట్లు బుధవారం ప్రకటించింది.   కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కేసీ వేణుగోపాల్, దీపేందర్‌ హుడా వంటి సిట్టింగ్‌ సభ్యులు లోక్‌సభకు ఎన్నికవడంతో ఆ  స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

 తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌ ఎంపీగా ఉన్న కె.కేశవరావు కాంగ్రెస్‌లోకి మారడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఒక సీటు, ఒడిశాలో మమతా మొహంతా రాజీనామాతో మరో సీటు ఖాళీ అయింది. ఈ 12 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుండగా, నామినేషన్‌ పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీగా ఈసీ ప్రకటించింది. 22న నామినేషన్‌ పత్రాల పరిశీలన, 26న అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, 27న బిహార్, రాజస్తాన్, తెలంగాణ, ఒడిశాల్లో నామినేషన్‌ల ఉపసంహరణకు గడువిచి్చంది. సెపె్టంబర్‌ 3వ తేదీన ఓటింగ్‌ నిర్వహిస్తారని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారని తెలిపింది.
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)