Breaking News

గుట్టు వీడిన అంతుచిక్కని వ్యాధి.. క్వారంటైన్‌లో గ్రామం

Published on Thu, 01/23/2025 - 10:21

శ్రీనగర్‌: అంతుచిక్కని వ్యాధి కారణంగా జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఇప్పటివరకు 17 మంది మృతిచెందారు. ఈ నేపధ్యంలో తాజాగా చండీగఢ్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌) బృందం రాజౌరి జిల్లాలోని
బుధల్ గ్రామాన్ని సందర్శించింది.

ఈ సందర్భంగా డాక్టర్ అమర్‌జిత్ సింగ్ భాటియా మాట్లాడుతూ ఈ అంతుచిక్కని వ్యాధికిగల కారణం వెల్లడయ్యిందని, బాధితులకు మెరుగైన చకిత్స అందిస్తామని, వారంతా త్వరలోనే కోలుకుంటారని అన్నారు. మరోవైపు స్థానిక వైద్యాధికారులు గ్రామాన్ని క్వారంటైన్‌  చేశారు. రాజౌరి పరిపాలన అధికారులు 150 పడకల తాత్కాలిక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులకు 24 గంటలూ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.

డాక్టర్ అమర్‌జీత్ సింగ్ భాటియా తెలిపిన వివరాల ప్రకారం ఈ మరణాలకు బాధితుల మెదడుకు హాని జరగడమే ప్రధాన కారణం. ఫలితంగా వారి నాడీ వ్యవస్థ దెబ్బతింది. తాజగా ఈ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన తొమ్మదిమందిలో ఐదుగురు కోలుకున్నారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్థానిక వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడి జనం ఆహార పదార్థాలను పరస్పరం పంచుకోవద్దని సూచిస్తున్నారు.

గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తక్షణ వైద్య సహాయం అందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు పోషకాహారం అందిస్తున్నారు. దుస్తులు, మందులు, పరిశుభ్రతా పరికరాలను అందిస్తున్నారు. ఈ కేంద్రంలో వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు పోలీసుశాఖ గ్రామంలో చోటుచేసుకున్న మరణాలకు నేరపూరత చర్యలేవైనా కారణమై ఉండవచ్చనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)