ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సందర్శించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌

Published on Fri, 05/30/2025 - 11:56

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సందర్శించారు. ‘ఆపరేషన్ సిందూర్’ విజయం తర్వాత ఆయన  ఈ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను దర్శించారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌(INS Vikrant)ను అరేబియా సముద్రంలో మోహరించారు.

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సందర్శన అనంతరం రక్షణ మంత్రి నావికాదళ అధికారులు, సైనికులను కలుసుకుని, ఆపరేషన్‌ సింధూర్‌లో సాధించించిన విజయంపై వారిని  అభినందించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో, భారత నావికాదళ బృందానికి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ నాయకత్వం వహించింది. దీనిలో డిస్ట్రాయర్లు, స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్‌(Stealth Guided Missile Frigate)లు  మొదలైన  10 యుద్ధనౌకలు ఉన్నాయి. పాక్‌ ఉద్రిక్తతలను  మరింతగా పెంచిన పక్షంలో భారత నావికాదళం యుద్ధనౌకలను మాత్రమే కాకుండా భూ లక్ష్యాలను కూడా టార్గెట్‌ చేసుకుంటుందని ఈ మోహరింపు పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశాన్నిచ్చింది. ఫలితంగా పాకిస్తాన్ నావికాదళం కరాచీ నావికా స్థావరం నుండి  ముందుకు వచ్చేందుకు ధైర్యం చేయలేకపోయింది. కాల్పుల విరమణకు డిమాండ్ చేసింది.
 

ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాన్ని జరుపుకునేందుకు, నావికా దళాలలో మనోధైర్యాన్ని పెంచేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సందర్శించారు. దీనికిముందు ఆయన శ్రీనగర్‌లో ఆర్మీ అధికారులను, భుజ్‌లోని వైమానిక దళాన్ని కలుసుకున్నారు. కాగా రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను 2022 సెప్టెంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత నావికాదళంలో చేర్చారు. 45,000 టన్నుల బరువున్న ఈ విమాన వాహక నౌక 76 శాతం మేరకు స్వదేశంలోనే తయారయ్యింది.

ఇది కూడా చదవండి: 20 ఏళ్ల కుర్రాడు.. 16వ అంతస్థు నుంచి దూకి..

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)