Breaking News

రాజస్తాన్‌: కుప్పకూలిన స్కూల్‌ పైకప్పు.. ఏడుగురు విద్యార్థుల దుర్మరణం

Published on Fri, 07/25/2025 - 09:39

రాజస్తాన్‌ ఝలవార్‌ జిల్లా ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకి చేరింది. మరో 15 మందికి గాయాలైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వీళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. 

శుక్రవారం ఉదయం 8.30గం.ప్రాంతంలో మనోహర్‌ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఓ తరగతి పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు క్లాస్‌లో కూర్చుని ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సాయంతో టీచర్లు శిథిలాలను తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు. 

శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, విద్యాశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని  సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 

20 ఏళ్ల కిందటి నాటి ఈ స్కూల్‌ భవనానికి మరమ్మత్తులు అవసరమని గతంలో పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో.. గత కొంతకాలంగా ఇక్కడ వర్షాలు పడుతుండడంతో ఈ ఘోరం జరిగింది. పైకప్పు రాళ్లతో కట్టి ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

School Building Collapse: రాజస్థాన్ లో ఘోర విషాదం

ప్రమాదంపై ప్రధాని మోదీ, రాజస్తాన్‌ సీఎం భజనాన్‌ లాల్‌ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి మదన్‌ దిలావర్‌ జిల్లా కలెక్టర్‌, అధికారులతో మాట్లాడి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)