అమ్మో..! కుంభకర్ణుడిలా ఏడాదిలో 300 రోజులు నిద్రపోతాడు..

Published on Tue, 06/27/2023 - 20:21

జైపూర్‌: పురాణాల్లో పేర్కొన్న కుంభకర్ణుడి గురించి అందిరికీ తెలిసే ఉంటుంది. ఏడాదిలో సగం భాగం నిద్రలోనే ఉండేవాడట. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లో ఓ వ్యక్తి ఏడాదిలో 300 రోజులూ నిద్రోలోనే గడిపేస్తాడు. ఓ అరుదైన వ్యాధి కారణంగా అతను నిత్యం నిద్రపోతాడట.. ఇంతకీ ఎవరతను.. ఏంటీ విషయం..

పుర్కారామ్‌.. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని భాడ్వా గ్రామానికి చెందిన వ్యక్తి.  ఆక్సిస్ హెపర్‌సోమ్నియా అనే అరుదైన వ్యాధి కారణంగా అతను సంవత్సరంలో 300 రోజులు నిద్రపోతూనే ఉంటాడు. గత 23 ఏళ్లుగా ఇతను ఈ నిద్ర వ్యాధితో బాధపడుతున్నాడు. నెలలో కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేస్తాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మెదడులో ఉండే ఈ డిజార్డర్ కారణంగానే ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. 

అయితే.. ఈ నిద్ర కారణంగా పుర్కారామ్ జీవితం తన రోజూవారీ పనులు కూడా చేసుకోలేడు. తినడం, స్నానం వంటి పనులు కూడా ఇతరులు సహాయం చేయాల్సి వస్తోంది. ఈ వ్యాధి సోకిన తొలినాళ్లలో చికిత్స చేపించామని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఎలాంటి ప‍్రయోజనం లేదని వెల్లడించారు. అయితే.. మొదట్లో రోజుకు 15 గంటలు నిద్రపోయేవాడని తెలిపారు. కాలం గడిచేకొద్దీ పుర్కారామ్ రోజులో నిద్రపోయే సమయం కూడా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పుర్కారామ్‌కు భార్య లచ్మి దేవి, తల్లి  కాన్వేరీ దేవి ఉన్నారు. తమ కుటుంబ సభ్యునికి వ్యాధి నయమవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: ఆ అవ్వ కళ్లలో ఆనందం.. ఐపీఎస్‌ అనుపై ప్రశంసలు  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)