Breaking News

చివరి క్షణాల్లో ప్రయాణికులను కాపాడి..

Published on Fri, 08/29/2025 - 15:31

ఒక్క ప్రాణం కాపాడిన.. వాడిని దేవుడితో సమానం అంటారు కదా. అలాంటిది తన చివరిక్షణాల్లోనూ పదుల సంఖ్యలో ప్రాణాలను కాపాడాడు ఇక్కడో డ్రైవర్‌. హృదయ విదారకమైన ఈ ఘటన బస్సులోని సీసీటీవీల్లో రికార్డయ్యింది. 

రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కదిలే బస్సులో ఓ డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోగా.. దానికంటే కొన్ని నిమిషాల ముందే అతను డ్రైవర్‌ సీటు నుంచి తప్పకుని హెల్పర్‌కు స్టీరింగ్‌ అప్పగించాడు. ఈ ఘటన అక్కుడున్నవాళ్లను తీవ్రంగా కలిచివేసింది. 

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ నుంచి జోధ్‌పూర్‌ రాజస్థాన్‌కు ఓ ప్రైవేట్‌ స్లీపర్‌ బస్సు వెళ్తోంది. బస్సు పాల్వి జిల్లా కేల్వా రాజ్‌నగర్‌ చేరుకోగానే.. డ్రైవర్‌ సతీష్ రావు తనకు ఒంట్లో ఏదోలా అనిపించడంతో వెంటనే స్టీరింగ్‌ను సహచర డ్రైవర్‌కు అప్పగించారు. దగ్గర్లో ఏదైనా క్లినిక్‌, మెడికల్‌ షాప్‌ ఉంటుందోనని చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అస్వస్థతతోనే సతీష్‌ బస్సులో అలాగే ముందుకు సాగారు. 

కాసేపటికే అకస్మాత్తుగా మూర్చపోయి కుప్పకూలిన దృశ్యం కనిపించింది. ప్రయాణికులు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సైలెంట్‌ హార్ట్‌ అటాక్ కారణంగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడారంటూ సతీష్‌పై అంతా ప్రశంసలు గుప్పిస్తూ నివాళులర్పిస్తున్నారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు