Breaking News

Rajasthan Assembly: పాత బడ్జెట్‌ చదివిన సీఎం అశోక్‌ గెహ్లాట్‌..!

Published on Fri, 02/10/2023 - 13:34

జైపూర్‌: రాజస్థాన్‌ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టే క్రమంలో పాత బడ్జెట్‌ ప్రతులను అసెంబ్లీకి తీసుకొచ్చారు. అది కూడా ఎవరో కాదు.. సీఎం స్థానంలో ఉన్న అశోక్‌ గెహ్లాట్‌. 2023-24 బడ్జెట్‌ను చదివే క్రమంలో గత బడ్జెట్‌ను సీఎం గెహ్లాట్‌ చదవడంతో అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు ఏమీ అర్థం కాలేదు. కాసేపటికి తప్పు తెలుసుకున్న సీఎం అశోక్‌ గెహ్లాట్‌ నాలుక కరుచుకున్నారు. తాను ఎంత పొరపాటు చేశానో తెలుసుకుని కొత్త బడ్జెట్‌ను చదివారు. ఏడు నిమిషాల పాటు పాత బడ్జెట్‌ను చదువుతూ ఉండటంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 

ఆఫీసర్స్‌ గ్యాలరీ నుంచి సందేశం
సీఎం అశోక్‌ గెహ్లాట్‌ పాత బడ్జెట్‌ను చదువుతున్నారనే విషయాన్ని హౌజ్‌ గ్యాలరీలో కూర్చొని ఉన్న ఫైనాన్స్‌ ఆఫీసర్లు చీఫ్‌ విప్‌ దృష్టికి తీసుకెళ్లారు.  దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకున్న బీజేపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. బడ్జెట్‌ ముందుగానే లీక్‌ అయ్యిందంటూ స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకొచ్చారు. దాంతో స్పీకర్‌ సీపీ జోషి సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)