Breaking News

Rajasthan: మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం వద్దే 8 కీలక శాఖలు

Published on Fri, 01/05/2024 - 18:49

జైపూర్‌: రాజస్థాన్‌లో కొత్తగా కొలువుదీరిన  బీజేపీ ప్రభుత్వం.. తన కేబినెట్‌లోని మంత్రులకు శాఖలు కేటాయించింది. ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ కీలక ఎనిమిది శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. వీటిలో హోం, ఎక్సైజ్‌, అవినీతి నిరోధక శాఖ, కార్మిక, గృహశాఖలు ఉన్నాయి. 

కీలక ఆర్థికశాఖను డిప్యూటీ సీఎం దియా కుమారికి కేటాయించారు.  విద్యాధర్ నగర్ ఎమ్మెల్యే అయిన ఆమె పర్యాటకం, కళలు సాహిత్యం సాంస్కృతిక, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, మహిళా శిశు సంక్షేమశాఖ వంటి మరో అయిదు విభాగాల బాధ్యతలను స్వీకరించారు. మరో డిప్యూటీ సీఎం ప్రేమ్‌ చంద్‌ బైరవాకు టెక్నికల్‌- ఉన్నత విద్య, రవాణా శాఖను కేటాయించారు. 

ఇతర క్యాబినెట్ మంత్రుల్లో కిరోడి లాల్ మీనాకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖలు, గజేంద్ర సింగ్ ఖిమ్సర్‌కు వైద్యారోగ్యం, రాజ్యవర్ధన్ రాథోడ్‌కు పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్.. మదన్ దిలావర్ పాఠశాల విద్యను కేటాయించారు.  అయితే  మంత్రులకు శాఖలను కేటాయించడంలో బీజేపీ ‍ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల తర్వాత బాధ్యతలను అప్పజెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. 

కాగా గత నవంబర్‌లో జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాం‍గ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతూ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.  డిసెంబర్‌ 15న రాజస్థాన్‌ సీఎంగా భజన్‌ లాల్‌ శర్మ, డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్‌చంద్‌ బైర్వా ప్రమాణ స్వీకారం చేశారు. గతవారం (డిసెంబర్ 30) గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా సమక్షంలో రాజ్‌భవన్‌లో 22 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 17 మంది తొలిసారిగా మంత్రులుగా ఎన్నికైన వారు ఉన్నారు. వీరందరికీ నేడు పోర్ట్‌ఫోలియోల కేటాయింపు జరిగింది. 
చదవండి: ఢిల్లీ: కన్నీరు పెట్టుకున్న స్వాతి మలివాల్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)