Breaking News

‘రథయాత్ర’కు రైల్వేశాఖ సన్నాహాలు

Published on Tue, 06/25/2024 - 09:04

దేశంలోని ప్రజలు దూర ప్రయాణాలు సాగించాలనుకున్నప్పుడు రైలునే ముందుగా ఎంచుకుంటారు. రైల్వేశాఖ కూడా ప్రజల ప్రయాణ అవసరాలను గుర్తించి, ప్రత్యక రైళ్లను కూడా నడుపుతుంటుంది. జూలై ఏడు నుంచి ఒడిశాలో ప్రారంభమయ్యే రథయాత్ర ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది.

ఒడిశాలోని పూరీలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వేడుకలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ఎంతో ఉత్సాహంతో పూరీకి తరలివెళుతుంటారు. అయితే ఈ సమయంలో అందరికీ రైలులో రిజర్వేషన్‌ దొరికే అవకాశం ఉండదు. దీంతో చాలామంది తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వస్తుంది. దీనిని గుర్తించిన రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ, భక్తుల అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేస్తోంది.

ఈసారి జగన్నాథ యాత్ర వేడుకలు జూలై 7న ప్రారంభమై జూలై 16న ముగియనున్నాయి. దీనిలో ప్రధానంగా జరిగే రథయాత్ర జూలై 7న జరగనుంది. రథయాత్ర నిర్వహణకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రైల్వే శాఖ కూడా పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది.

జగన్నాథ యాత్రను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ  ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే పూరీ వరకు అనేక రైళ్లను పొడిగించనుంది. పూరీ యాత్రకు వెళ్లే ప్రయాణికుల కోసం వివిధ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్‌లను కూడా భక్తులకు రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచనన్నారు. తద్వారా ప్రయాణికులు టిక్కెట్లను సలభంగా పొందవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు