Breaking News

రైల్వే ట్రాక్‌లపై గస్తీ పెంపు

Published on Sat, 08/24/2024 - 07:02

ఇటీవలి కాలంలో తరచూ రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని నివారించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు అ‍ప్రమత్తమవుతూ పలు చర్యలు చేపడుతోంది. తాజాగా ఏఐ సాయంతో ట్రాక్‌లపై భద్రతను పెంచే దిశగా ముందుకు కదులుతోంది.

ఆగస్టు 17న అహ్మదాబాద్‌కు వెళ్లే సబర్మతి ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ - భీమ్‌సేన్ జంక్షన్ మధ్య పట్టాలు తప్పింది.  ఎవరో పట్టాలపై ఉంచిన భారీ వస్తువును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు రైల్వేశాఖ గుర్తించింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రైల్వే ట్రాక్‌లపై పెట్రోలింగ్‌ను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అ‍ర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ (ఏఐ) సాయం తీసుకోవాలని వారు భావిస్తున్నారు.

ఆర్‌పీఎఫ్‌తో పాటు ట్రాక్ మెయింటెనెన్స్ సిబ్బంది ఏడాది పొడవునా క్రమ వ్యవధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. కాగా సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం తర్వాత వారు మరింత అప్రమత్తంగా ఉన్నారని రైల్వే బోర్డు అధికారులు మీడియాకు తెలిపారు. అయితే ట్రాక్‌ల నిర్వహణకు సిబ్బంది కొరత కారణంగా ఏడాది పొడవునా నైట్ పెట్రోలింగ్ నిర్వహించడం లేదని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయి. సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం విషయానికొస్తే ఈ సంఘటనకు ముందు నైట్ పెట్రోలింగ్ చేయలేదని అందుకే ప్రమాదం చోటుచేసుకున్నదని అధికారులు గుర్తించారు. రైలు రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు ఎవరైనా ఆ భారీ వస్తువును పట్టాలపై ఉంచారా? అనే కోణంలో రైల్వే శాఖ దర్యాప్తు చేస్తోంది.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు