Breaking News

బర్డ్‌ఫ్లూ కలకలం.. 11 వేల కోడిపిల్లలు, నాలుగువేల కోళ్లను చంపి..

Published on Sun, 02/02/2025 - 13:39

రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో బర్డ్ ఫ్లూ మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం  11 వేల కోడిపిల్లలను, 4,356 కోళ్లను చంపి, పాతిపెట్టింది. ప్రభుత్వ కోళ్ల ఫారంలో చనిపోయిన కోళ్ల నమూనా పరీక్షల్లో వైరస్ హెచ్‌5 ఎన్‌1 నిర్ధారించిన తర్వాత  అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ కోళ్ల ఫారంలో కోళ్లు చనిపోతున్న దరిమిలా అధికారులకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందనే అనుమానం వచ్చింది. దీంతో వెంటనే కోళ్ల నమూనాను పరీక్షల కోసం భోపాల్‌లోని నేషనల్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపారు. అక్కడ ఆ నమూనాలలో హెచ్‌5 ఎన్‌1 నిర్ధారణ అయ్యింది.

దీనిపై రాయ్‌గఢ్ కలెక్టర్ కార్తికేయ గోయల్ మీడియాతో మాట్లాడుతూ భోపాల్‌లోని నేషనల్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల రాయ్‌గఢ్‌లోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్ నుండి పంపిన కోళ్ల  నమూనాలలో బర్డ్ ఫ్లూ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిదన్నారు. అందుకే కోళ్ల ఫారమ్‌లోని మిగిలిన కోళ్లను,  కోడిపిల్లలను చంపి పాతిపెట్టారన్నారు. రాయ్‌గఢ్ కలెక్టర్ మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, ప్రభుత్వ కోళ్ల ఫారం ఆవరణలో పూర్తి భద్రతా చర్యల నడుమ జేసీబీసహాయంతో ఒక గొయ్యి తవ్వి, చనిపోయిన కోళ్లు , కోడిపిల్లలను పూడ్చిపెట్టామని తెలిపారు.  అలాగే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కోడి గుడ్లను కూడా నాశనం చేశారు. 

ఇది కూడా చదవండి: రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)