Breaking News

అశ్లీల కథలు బిగ్గరగా చదవాలంటూ.. మెడికల్‌ కాలేజీల్లో హద్దులు దాటిన ర్యాగింగ్‌

Published on Sun, 11/17/2024 - 11:42

న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్‌పై జరిగిన హత్యాచారం యావత్‌ దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై దేశంలోని వైద్యులంతా నిరసనలు చేపట్టారు. ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

ఇటువంటి ఘటనలు కొనసాగున్న తరుణంలో.. మెడికల్ కాలేజీల్లో కొత్తగా అడ్మిషన్ తీసుకుని, కాలేజీల్లో  చేరిన జూనియర్‌ విద్యార్థులను సీనియర్లు పరిధులు దాటి ర్యాంగింగ్‌ చేస్తున్న వైనాలు వెలుగు చూస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా  అందించిన వివరాల ప్రకారం మెడికల్ కాలేజీల్లో కొత్తగా చేరిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్‌ పేరిట వేధిస్తున్నారు. వారి చేత అశ్లీల పుస్తకాలలోని కథలను బిగ్గరగా చదివిస్తూ, వాటిని గుర్తుపెట్టుకోవాలని బలవంతం చేస్తున్నారు.

స్త్రీలపై లైంగిక హింసకు పాల్పడే కథలను జూనియర్ల చేత సీనియర్లు చదివిస్తున్నారు. నిజానికి సీనియర్ వైద్యు విద్యార్థులు కొత్తగా చేరిన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలను అందజేయాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా సీనియర్‌ విద్యార్థులు ప్రవర్తిన్నున్న తీరు కనిపిస్తోంది. అలాగే బోర్డుపై అశ్లీల పదాలను రాసి, వాటిని బిగ్గరగా చదవమంటున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు.

ఇటువంటి సందర్భాల్లో జూనియర్లు వెనుకాడితే సీనియర్లు నవ్వుతూ వారిని ఎగతాళి చేస్తుంటారని తెలుస్తోంది. బ్లాంక్ నాయిస్ వ్యవస్థాపకురాలు జాస్మిన్ పతేజా  మీడియాతో మాట్లాడుతూ సీనియర్‌ విద్యార్థులు జూనియర్లతో ర్యాగింగ్‌ చేసే అంశాలు అత్యాచారాలను ప్రోత్సహించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆపరేషన్ టేబుల్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న రోగులను చూసి కొందరు అనస్థీషియాలజిస్టులు, సర్జన్లు నీచంగా మాట్లాడటాన్ని చూశానని ఓ సీనియర్ మహిళా డాక్టర్ మీడియా ముందు వాపోయారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్వాకం.. విద్యార్థికి గుండు కొట్టించి...

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)