Breaking News

రెండు రోజుల్లో మణిపూర్‌లోకి 718 మంది మయన్మార్ దేశస్తులు..

Published on Tue, 07/25/2023 - 16:11

 ఇంఫాల్: మణిపూర్‌లో అల్లర్లు మొదలై రెండు నెలలకు పైబడుతోంది. ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితి చక్కబడుతోంది. మెల్లిగా జనజీవనం కూడా యధాస్థితికి చేరుకుంటోంది. అంతలోనే మయన్మార్ నుండి 700 కు పైగా వలసదారులు మణిపూర్‌లో అడుగుపెట్టారు. రాష్ట్ర సరిహద్దు చుట్టూ వేల సంఖ్యలో అస్సాం రైఫిల్స్ ను కాపలా పెట్టినా సరైన డాక్యుమెంట్లు లేకుండా అంతమంది రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారన్నదే ప్రభుత్వాన్ని తొలిచేస్తున్న ప్రధాన ప్రశ్న. 

మే 3 నుండి మణిపూర్‌లో జరిగిన హింసాకాండకు యావత్ భారతదేశం నివ్వెరపోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో నివసించే రెండు జాతుల మధ్య వైరుధ్యం కారణంగా చెలరేగిన అల్లర్లు సుమారు 150 మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఎన్నో ఇళ్ళు దగ్ధమయ్యాయి. ఏ వీధిని చూసిన సగం కాలిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. 40 వేలకు పైగా రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయారు. 

ఒకపక్క ప్రాణాలను చేత బట్టుకుని మణిపూర్ వాసులు వలస పోతుంటే పక్క దేశం నుండి అగ్నిగుండంలా ఉన్న రాష్ట్రంలోకి వలసలు వస్తున్నారు. హోంశాఖ తెలిపిన విసరాల ప్రకారం జులై 22, 23 లోనే మయన్మార్ నుండి 718 మంది వలసవచ్చారు. వీరంతా ఎవరనేది మణిపూర్ ప్రభుత్వానికి ఎదురవుతున్న మొదటి ప్రశ్న. 

బ్రతుకు తెరువు కోసమే వచ్చారా లేక ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించడానికి వచ్చారా? అన్నదానిపై స్పష్టత లేదు. వారు ఆయుధాలు ఏవైనా వెంట తెచ్చుకున్నారా అన్న సమాచారం కూడా హోంశాఖ వద్ద లేదు. సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రతా దళాలు ఉన్నప్పటికీ వారి వద్ద సరైన పత్రాలు ఉన్నాయా లేవా అన్నది పరిశీలించకుండానే అనుమతించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇది కూడా చదవండి: ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)